Ravindra Jadeja Eyes On Kapil Dev Record: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన సాధించే అవకాశం ఉంది. బార్బడోస్‌లో జడ్డూ గనుక మూడు వికెట్లు పడగొడితే భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది. కాగా టెస్టు సిరీస్‌తో వెస్టిండీస్ పర్యటన ఆరంభించిన భారత జట్టు.. 1-0తో ట్రోఫీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
అరుదైన ఘనతకు మూడడుగుల దూరంలో
ఈ క్రమంలో గురువారం (జూలై 27) నుంచి వన్డే సిరీస్ ఆరంభించనుంది. బార్బడోస్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన తర్వాత రవీంద్ర జడేజా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు కీలకంగా మారిన జడ్డూకు తుది జట్టులో చోటు దక్కడం లాంఛనమే.
కుంబ్లేతో సంయుక్తంగా
ఈ క్రమంలో అతడు అరుదైన ముంగిట నిలిచాడు. అదేంటంటే.. వన్డే ఫార్మాట్లో వెస్టిండీస్‌పై కపిల్ దేవ్ 43 వికెట్లు తీశాడు. తద్వారా ఇప్పటి వరకు విండీస్‌తో వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో 41 వికెట్లతో అనిల్ కుంబ్లేతో కలిసి రవీంద్ర జడేజా ఉన్నాడు.
ఒకవేళ తాజా సిరీస్‌లో భాగంగా మొదటి వన్డేలో జడ్డూ మూడు వికెట్లు తీశాడంటే.. కపిల్ దేవ్‌ను అధిగమించడం ఖాయం. ప్రస్తుతం జడ్డూ ఫామ్ చూస్తుంటే ఇదేమీ కష్టంకాదనిపిస్తోంది. కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. జూలై 27, 29 నాటి మ్యాచ్‌లు బార్బడోస్‌లో జరుగనున్నాయి. ఆగష్టు 1 నాటి ఆఖరి వన్డేకు ట్రినిడాడ్ వేదిక కానుంది.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చహల్, కుల్దీప్, జైదేవ్ ఉనాద్కట్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్.
చదవండి: ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే!
రెండ్రోజులు అక్కడే పెట్టిన అరటిపండును శ్రీశాంత్ తిన్నాడు! ఆఖరికి లోదుస్తులు కూడా..
Comments
Please login to add a commentAdd a comment