వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఆట తీరు మార లేదు. టీమిండియాతో టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదదర్శన కనబరిచిన విండీస్.. ఇప్పుడు వన్డే సిరీస్‌లోనూ అదే పునరావృతం చేస్తోంది. బార్బోడస్ వేదికగా భారత్ జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో కరేబియన్ జట్టు ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ కేవలం 114 పరుగులకే కుప్పకూలింది.
కెప్టెన్ షాయ్ హోప్(43) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు, జడేజా మూడు వికెట్లు సాధించి విండీస్ పతనాన్ని శాసించారు. అనంతరం 115 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 22.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చిన కిషన్(52) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
రవీంద్ర జడేజా అరుదైన ఘనత..
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించాడు. వన్డే ఫార్మాట్లో వెస్టిండీస్‌పై తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. తొలి వన్డేలో మూడు వికెట్లతో చెలరేగిన జడ్డూ.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
ఇప్పటివరకు విండీస్‌పై వన్డేల్లో 44 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో భారత దిగ్గజం కపిల్‌దేవ్(43 వికెట్లు) రికార్డును జడ్డూ బ్రేక్ చేశాడు. అదే విధంగా భారత్-వెస్టిండీస్ మధ్య వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా, దిగ్గజ విండీస్ పేస్ బౌలర్ కోర్ట్నీ వాల్ష్ రికార్డును సమం చేశాడు.
చదవండి: IND vs WI: తీరు మారని వెస్టిండీస్.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment