టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు సాధించిన 14వ ప్లేయర్‌గా, వన్డేల్లో భారత్ తరఫున కపిల్ (3783 పరుగులు, 253 వికెట్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా, భారత్ తరఫున వన్డేల్లో 200 వికెట్ల మార్కును అందుకున్న ఏడో బౌలర్‌గా (337 వన్డే వికెట్లతో కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు) రికార్డుల్లోకెక్కాడు.
The moment when Jadeja completed 200 wickets in ODIs.
— Johns. (@CricCrazyJohns) September 15, 2023
- A historic moment....!!!!!!!pic.twitter.com/uv4ulOrYpk
ఆసియా కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 15) జరుగుతున్న మ్యాచ్‌లో షమీమ్ హొస్సేన్ వికెట్ పడగొట్టడం ద్వారా జడ్డూ వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కెరీర్‌లో 182వ వన్డే ఆడుతున్న జడ్డూ.. 200 వికెట్లతో పాటు 2578 పరుగులు చేశాడు.
కాగా, కొలొంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా పట్టుబిగించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్.. 45 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. షకీబ్ (80), తౌహిద్ హ్రిదోయ్ (54) అర్ధసెంచరీలతో రాణించగా.. తంజిద్ హసన్ (13), లిటన్ దాస్ (0), అనాముల్ హాక్ (4), మెహిది హసన్ (13), షమీమ్ హొస్సేన్ (1) విఫలమయ్యారు. నసుమ్ అహ్మద్ (35), మెహిది హసన్ (13) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా.. షమీ 2, అక్షర్, జడేజా తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment