వెస్టిండీస్- భారత్ మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరిదైన మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. ట్రినిడాడ్ వేదికగా మంగళవారం జరగనున్న ఈ కీలక మ్యాచ్‌లో భారత్-విండీస్ జట్టు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇక రెండో వన్డేలో ప్రయోగాలు చేసి ఓటమిపాలైన భారత జట్టు.. ఆఖరి మ్యాచ్‌లో మాత్రం పూర్తి స్ధాయి జట్టుతోనే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విండీస్ మాత్రం రెండో వన్డే ఫలితాన్నే పునరావృతం చేసి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది.
ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కీలక వాఖ్యలు చేశాడు. మూడో వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంటమని జడ్డూ థీమా వ్యక్తం చేశాడు. "మేము చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. అందులో ఎటువంటి సందేహం లేదు. మేము గత మ్యాచ్‌లో ఓడిపోయాం. అదేమి పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఆటలో గెలుపు, ఓటములు సహజం. మేము మా జట్టులో కొన్ని ప్రయోగాలు చేశాం. అందుకే ఫలితం మేము ఆశించిన విధంగా రాలేదు. ఆసియాకప్, ప్రపంచకప్‌కుముందు మేము ఆడుతున్న ఏకైక వన్డే సిరీస్ ఇది.
అందుకే జట్టు కాంబనేషన్‌లో కొన్ని మార్పులు చేశాం. ఇది మా జట్టుపై ఎటువంటి ప్రభావం చూపదు. ఇక విండీస్ యువ ఆటగాళ్లతో కూడిన జట్టు. వారు నేర్చుకోనే స్ధాయిలో ఉన్నారు. అయినప్పటికీ వారు అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. వారు భారత జట్టు నుంచి చాలా విషయాలు నేర్చకుంటున్నారని నేను ఆశిస్తున్నాను. వారిలో అద్భుతమైన టాలెంట్ ఉంది. మేము కచ్చితంగా ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి, సిరీస్‌ను సొంతం చేసుకుంటామని జడేజా ఓ స్పోర్ట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: IND vs WI: టీమిండియాతో టీ20 సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు వచ్చేశాడు
Comments
Please login to add a commentAdd a comment