
కోహ్లి కమాన్.. ఇంకా రెండే అడుగులు!
దుబాయ్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి నంబర్ వన్ మైలురాయి అందుకునేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. టెస్టు కెరీర్ లో బెస్ట్ ర్యాంకు సాధించాడు. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు బ్యాట్సమన్ ర్యాంకుల్లో 3వ స్థానానికి ఎగబాకాడు. 833 పాయింట్లతో 3వ ర్యాంకులో నిలిచాడు. టెస్టు ర్యాంకింగ్స్ కోహ్లికి 3వ ర్యాంకు దక్కించుకోవడం ఇదే మొదటిసారి.
ఇంగ్లండ్ తో జరిగిన మూడు టెస్టుల్లో కోహ్లి 405 పరుగులు చేశాడు. జోయ్ రూట్, స్టీవెన్ స్మిత్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్ తో జరగనున్న మరో రెండు టెస్టు మ్యాచుల్లో కోహ్లి అద్భుతంగా రాణిస్తే నంబర్ వన్ ర్యాంకు దక్కించుకునే అవకాశముంది. పుజారా 8వ ర్యాంకులో ఉన్నాడు.
ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో రవీంద్ర జడేజా నాలుగో స్థానానికి ఎగబాకాడు. అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల జాబితాలో మహ్మద్ షమి 21 నుంచి 19వ ర్యాంకుకు చేరుకున్నాడు. మొహాలి టెస్టులో 5 వికెట్లు పడగొట్టడంతో షమి ర్యాంకు మెరుగైంది.