దుబాయ్ : ఐసీసీ ఆదివారం బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ 901 పాయింట్లతో టాప్ స్థానం నిలుపుకోగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 888 పాయింట్లతో రెండో స్థానంలోనే ఉన్నాడు. తాజాగా ఆసీస్‌తో జరిగిన పింక్‌బాల్ టెస్టులో టీమిండియా ఘోర ప్రదర్శన నమోదు చేసింది. మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయి అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. పింక్‌బాల్ టెస్టులో టీమిండియా ఆటగాళ్ల చెత్త ప్రదర్శన తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో స్పష్టంగా కనబడింది. ఒకవేళ కెప్టెన్ కోహ్లి ఆసీస్‌తో జరిగిన మొదటి టెస్టులో సెంచరీ చేసి ఉంటే మొదటిస్థానానికి ఎగబాకే అవకాశం ఉండేది. కానీ మొదటి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేయడం.. రెండో ఇన్నింగ్స్‌లో 4పరుగులకే వెనుదిరగడంతో రెండు పాయింట్లు సాధించి 888 పాయింట్లతో 2వ స్థానంలోనే ఉన్నాడు.(చదవండి : నీదే పిల్లాడి మనస్తత్వం అందుకే, ఇలా..)
ఇక ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ తొలి టెస్టులో అంతగా ఆకట్టుకోకపోయినా మొదటిస్థానాన్ని నిలుపుకున్నాడు. ఆసీస్‌తో టెస్టుకు ముందు 7వ స్థానంలో ఉన్న పుజారా ఒకస్థానం దిగజారి 8వ స్థానంలో నిలిచాడు. ఇక వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న కేన్ విలియమ్‌సన్ మూడో స్థానానికి చేరుకోగా.. కోహ్లి, విలియమ్‌సన్‌ల మధ్య కేవలం 11 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. (చదవండి : అచ్చం ధోని తరహాలో..)
ఇక బౌలింగ్ విషయానికి వస్తే పింక్‌బాల్ టెస్టులో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న హాజిల్‌వుడ్ ఏకంగా 5వ స్థానానికి చేరుకోగా.. మరో ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ 910 పాయింట్లో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. భారత్ బౌలర్లలో అశ్విన్ ఒక స్థానం మెరుగుపరుచుకొని 9వ స్థానంలో నిలిచాడు.. పింక్‌బాల్ టెస్టుకు ముందు 8వ స్థానంలో ఉన్న బుమ్రా రెండు స్థానాలు దిగజారి హోల్డర్‌తో కలిసి సంయుక్తంగా 10వ స్థానంలో నిలిచాడు
Comments
Please login to add a commentAdd a comment