AUS VS WI 1st Test: రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా ఇవాళ (జనవరి 17) తొలి మ్యాచ్ ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది.
ఓపెనర్‌గా కొత్త అవతారమెత్తిన స్టీవ్ స్మిత్ 12 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. లబూషేన్ (10) కూడా తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. ఉస్మాన్ ఖ్వాజా (30), కెమరూన్ గ్రీన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ అరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ 2 వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. ఆసీస్ పేసర్లు జోష్ హాజిల్‌వుడ్ (4/44), కెప్టెన్ పాట్ కమిన్స్ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్ బ్యాటర్ కిర్క్ మెక్‌కెంజీ (50) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు.
ఓపెనర్లు బ్రాత్‌వైట్ (13), తేజ్‌నరైన్ చంద్రపాల్ (6), అలిక్ అథనాజ్ (13), కవెమ్ హాడ్జ్ (12), జస్టిన్ గ్రీవ్స్ (5), జాషువ డిసిల్వ (6), అల్జరీ జోసఫ్ (14), మోటీ (1) నిరాశపర్చగా.. 11వ నంబర్ ఆటగాడు షమార్ జోసఫ్ (35) ఎంతో ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడి విండీస్ పరువు కాపాడాడు. షమార్.. కీమర్ రోచ్‌తో (17 నాటౌట్) కలిసి చివరి వికెట్‌కు 55 పరుగులు జోడించాడు.
Comments
Please login to add a commentAdd a comment