ఆస్ట్రేలియా పర్యటనను వెస్టిండీస్ ఓటమితో ప్రారంభించింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 164 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 497 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 333 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నప్పటికి మిగతావాళ్లు విఫలమయ్యారు. టగ్ నరైన్ చందర్‌పాల్ 45 పరుగులు చేశాడు. చివర్లో రోస్టన్ చేజ్ 55 పరుగులు, అల్జారీ జోసెఫ్ 43 పరుగులు.. కాస్త ప్రతిఘటించినప్పటికి ఆస్ట్రేలియా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియోన్ ఆరు వికెట్లతో చెలరేగగా.. ట్రెవిస్ హెడ్ 2, హాజిల్‌వుడ్, స్టార్క్‌లు చెరొక వికెట్ తీశారు. లియోన్ టెస్టు కెరీర్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది 21వ సారి కాగా.. ఓవరాల్‌గా మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్‌లు డబుల్ సెంచరీలతో చెలరేగడంతో 598 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ల దాటికి 283 పరుగులకు ఆలౌటైంది.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ తన ఇన్నింగ్స్‌ను 182 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన లబుషేన్ మరోసారి సెంచరీతో చెలరేగడం విశేషం. మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీతో చెలరేగిన లబుషేన్ మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు డిసెంబర్ 8 నుంచి 12వరకు అడిలైడ్ వేదికగా జరగనుంది.
Nathan Lyon seals it in Perth!
— Cricket Australia (@CricketAus) December 4, 2022
Be sure to join the Australian Men's Cricket Team in Adelaide on Thursday and keep the momentum going for this summer of cricket! pic.twitter.com/oveeRTbwm0
చదవండి: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. రిషబ్ పంత్ దూరం! బీసీసీఐ కావాలనే తప్పించిందా?
Comments
Please login to add a commentAdd a comment