ఆడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 419 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆసీస్ జట్టు 2-0తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. 497 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ కేవలం 77 పరుగులకే కుప్పకూలింది. మిచిల్ స్టార్క్, నీసర్, బోలాండ్ చెరో మూడు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించారు.
అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో లాబుషేన్(163), హెడ్(175) అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. అనంతరం విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు ఆలౌటైంది.
297 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా 6 వికెట్లకు 199 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని 497 పరుగుల భారీ లక్ష్యం విండీస్ ముందు ఆసీస్ ఉంచింది. ఇక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా హెడ్ ఎంపిక కాగా.. ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా లాబుషేన్ నిలిచాడు.
చదవండి: Karun Nair: తొలి సిరీస్‌లోనే ట్రిపుల్ సెంచరీ.. 5 ఏళ్ల క్రితం చివరి మ్యాచ్! డియర్ క్రికెట్ ఒక్క ఛాన్స్ ప్లీజ్
Comments
Please login to add a commentAdd a comment