వెస్టిండీస్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు మరోసారి దూకుడు ప్రదర్శించారు. ఆట తొలిరోజునే విండీస్ బౌలర్లను ఉతికారేస్తూ ఇద్దరు ఆసీస్ బ్యాటర్లు సెంచరీలతో అజేయంగా నిలిచారు. తొలిరోజు ఆట ముగిసేసమయానికి మూడు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్(120 బ్యాటింగ్), ట్రెవిస్ హెడ్(114 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
అంతకముందు ఉస్మాన్ ఖవాజా 62 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో డెవన్ థామస్, అల్జారీ జోసెఫ్, జాసన్ హోల్డర్ తలా ఒక వికెట్ తీశారు. ఇక మార్నస్ లబుషేన్ తన కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. ఈ సిరీస్‌లో లబుషేన్‌కు ఇది మూడో సెంచరీ. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు సాధించిన లబుషేన్ తాజాగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment