AUS VS WI 1st Test: Labuschagne Joins Elite Group With Double And Single Century In Same Test - Sakshi
Sakshi News home page

AUS VS WI 1st Test: అరుదైన రికార్డు సాధించిన లబూషేన్‌

Published Sat, Dec 3 2022 4:55 PM | Last Updated on Sat, Dec 3 2022 5:50 PM

AUS VS WI 1st Test: Labuschagne Joins Elite Group With Double And Single Century In Same Test - Sakshi

పెర్త్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా యువ కెరటం మార్నస్‌ లబూషేన్‌ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ బాదిన లబూషేన్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ కొట్టి, టెస్ట్‌ల్లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా, మూడో ఆసీస్‌ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

గతంలో దిగ్గజ క్రికెటర్లు డౌగ్‌ వాల్టర్స్‌, గ్రెగ్‌ ఛాపెల్‌ (ఆస్ట్రేలియా), లారెన్స్‌ రోవ్‌, బ్రియాన్‌ లారా (వెస్టిండీస్‌), సునీల్‌ గవాస్కర్‌ (ఇండియా), గ్రహం గూచ్‌ (ఇంగ్లండ్‌), కుమార సంగక్కర (శ్రీలంక) ఈ ఫీట్‌ను సాధించగా.. తాజాగా లబూషేన్‌ వీరి సరసన చేరాడు. లబూషేన్‌ తొలి ఇన్నింగ్స్‌లో  350 బంతుల్లో 20 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 204 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 110 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

ఇదిలా ఉంటే, విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. ప్రత్యర్ధి ముందు 498 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (166 బంతుల్లో 101 నాటౌట్‌; 11 ఫోర్లు) వీరోచితంగా పోరాడటంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్‌ 3 వికెట్ల నష్టానికి​192 పరుగులు చేసి లక్ష్యానికి మరో 306 పరుగుల దూరంలో ఉంది. బ్రాత్‌వైట్‌ అజేయమైన సెంచరీతో విండీస్‌ను గట్టెక్కించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. 

స్కోర్‌ వివరాలు..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌:  598/4 డిక్లేర్‌ (లబూషేన్‌ 204, స్టీవ్‌ స్మిత్‌ 200 నాటౌట్‌)

వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 283 ఆలౌట్‌ (క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ 64, టగెనరైన్‌ చంద్రపాల్‌ 51)

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 182/2 డిక్లేర్‌ (లబూషేన్‌ 104 నాటౌట్‌)

వెస్టిండీస్‌: 192/3 (క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ 101 నాటౌట్‌) నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement