ఆసీస్‌తో రెండో టెస్ట్‌.. విండీస్‌ను ఆదుకున్న లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు | WI Vs AUS 2nd Test: West Indies Are 266 For 8 At Day 1 Stumps, Check Score Details Inside - Sakshi
Sakshi News home page

WI Vs AUS 2nd Test: ఆసీస్‌తో రెండో టెస్ట్‌.. విండీస్‌ను ఆదుకున్న లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు

Published Fri, Jan 26 2024 8:52 AM | Last Updated on Fri, Jan 26 2024 1:08 PM

WI VS AUS 2nd Test: West Indies Are 266 For 8 At Day 1 Stumps - Sakshi

బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పర్యాటక విండీస్‌ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌.. 64 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మిడిలార్డర్‌ బ్యాటర్లు కవెమ్‌ హాడ్జ్‌ (71), వికెట్‌కీపర్‌ జాషువ డసిల్వ (79) విండీస్‌ను ఆదుకున్నారు.

వీరిద్దరూ ఆరో వికెట్‌కు 149 పరుగులు జోడించి విండీస్‌ పతనాన్ని అడ్డుకున్నారు. ఈ మ్యాచ్‌లోనూ విండీస్‌ టాపార్డర్‌ యధాతథంగా తమ పేలవ ప్రదర్శనను కొనసాగించింది. కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌ 4, చంద్రపాల్‌ 21, మెక్‌కెంజీ 21, అథనాజ్‌ 8, జస్టిన్‌ గ్రీవ్స్‌ 6 పరుగుల చేసి ఔటయ్యారు. హాడ్జ్‌, డసిల్వతో పాటు బౌలర్‌ అల్జరీ జోసఫ్‌ (32) రాణించి విండీస్‌ పరువు కాపాడారు. 16 పరుగులతో కెవిన్‌ సింక్లెయిర్‌ క్రీజ్‌లో ఉన్నాడు.

ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ 4 వికెట్లు పడగొట్టి విండీస్‌ పతనాన్ని శాశించగా.. హాజిల్‌వుడ్‌ 2, కమిన్స్‌, నాథన్‌ లయోన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement