టీమిండియానే టాప్.. | india retain top spot in the ICC Test Team Rankings | Sakshi
Sakshi News home page

టీమిండియానే టాప్..

Published Thu, May 18 2017 6:39 PM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM

టీమిండియానే టాప్..

టీమిండియానే టాప్..

దుబాయ్:అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్ లో భారత క్రికెట్ జట్టు తన నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకుంది. గురువారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లి సేన తన ర్యాంకును పదిలంగా ఉంచుకుంది.టీమిండియా ఒక పాయింట్ మెరుగుపరుచుని 123 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

 

అదే సమయంలో ఎనిమిది పాయింట్లను మెరుగుపరుచుకున్న దక్షిణాఫ్రికా 117 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలోనిలవగా, ఆస్ట్రేలియా ఎనిమిది పాయింట్లు దిగజారి 100 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. ఇక ఇంగ్లండ్(99 పాయింట్లు) నాల్గో స్థానంలో, న్యూజిలాండ్(97 పాయింట్లు) ఐదో స్థానంలో, పాకిస్తాన్(93 పాయింట్లు) ఆరో స్థానంలో ఉన్నాయి. ఆ తరువాత స్థానాల్లో వరుసగా శ్రీలంక, వెస్టిండీస్,బంగ్లాదేశ్, జింబాబ్వేలు ఉన్నాయి. ఇక్కడ భారత్, దక్షిణాఫ్రికాలు తమ పాయింట్లను మెరుగుపరుచుకుని టాప్ -2లో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లు, పాకిస్తాన్ లు పాయింట్లను కోల్పోయి తమ పూర్వపు స్థానాలను కాపాడుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement