
దుబాయ్: టెస్టుల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్ ర్యాంకు చేజారింది. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో రాణించిన కోహ్లి రెండో టెస్టులో విఫలమయ్యాడు. దీంతో ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అతను రెండో స్థానానికి పడిపోయాడు. ఆశ్చర్యకరంగా ఆటకు దూరమైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్మిత్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. టాప్–10లో భారత కెప్టెన్‌తో పాటు చతేశ్వర్ పుజారా ఆరో ర్యాంకులో ఉన్నాడు.
రెండో టెస్టులో బ్యాటింగ్‌లో కుదురుగా ఆడిన అశ్విన్ 67 నుంచి 57వ స్థానానికి ఎగబాకాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకు ల్లో దక్షిణాఫ్రికాకు చెందిన ఫిలాండర్‌ను వెనక్కినెట్టిన అశ్విన్ మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. అతని సహచరుడు జడేజా రెండో ర్యాంకులో ఉన్నాడు. బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ సీమర్ అండర్సన్ తొలిసారి 903 రేటింగ్ పాయింట్ల మార్క్‌ను దాటాడు. 1980లో బోథమ్ తర్వాత 900 మార్క్ చేరిన ఇంగ్లండ్ ఆటగాడిగా అండర్సన్ ఘనతకెక్కాడు.
Comments
Please login to add a commentAdd a comment