దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత్ మరో స్థానం దిగజారింది. తాజా జాబితాలో భారత్ ఓ స్థానం కోల్పోయి ఏడో ర్యాంక్కు పడిపోయింది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ను భారత్ 2-0తో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ ర్యాంక్ దిగజారింది. కాగా ఈ సిరీస్లో అద్భుతంగా రాణించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంక్ మెరుగుపడింది. కోహ్లీ మూడు స్థానాలు సంపాదించి 12వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ఇక ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ (4) సాధించాడు.