
టెస్టు క్రికెట్‌లో వరల్డ్ నెంబర్ వన్ బౌలర్‌గా మరోసారి టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్ అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అశ్విన్... టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను వెనక్కినెట్టి టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు.
కాగా అశ్విన్ తన కెరీర్‌లో ఫస్ట్ ర్యాంక్‌ను సాధించడం ఇది ఆరోసారి. 2015 డిసెంబర్‌లో తొలిసారి టాప్ ర్యాంక్‌ను అశూ సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో అశ్విన్ తన స్పిన్ మయాజాలన్ని ప్రదర్శించాడు. ఓవరాల్‌గా ఈ ఐదు టెస్టుల సిరీస్ లో 26 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు.
అశ్విన్‌తో పాటు ఈ సిరీస్‌లో సంచలన ప్రదర్శన కనబరిచిన కుల్దీప్ యాదవ్ తన కెరీర్‌లో బెస్ట్ ర్యాంక్‌ను పొందాడు. కుల్దీప్ 15 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక ఇప్పటివరకు టాప్ ర్యాంక్‌లో కొనసాగిన బుమ్రా.. మూడో స్ధానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో సత్తాచాటిన హేజిల్‌వుడ్ రెండో స్థానానికి ఎగబాకాడు.
చదవండి: ICC Test Rankings: సత్తాచాటిన రోహిత్ శర్మ, జైశ్వాల్.. టాప్ 10 లోకి
Comments
Please login to add a commentAdd a comment