ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ సత్తా చాటారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసిన యశస్వి ఒక్కసారిగా 14 స్థానాలు మెరుగుపర్చుకుని 15వ ర్యాంక్‌కు దూసుకురాగా.. రాజ్‌కోట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదంతొక్కిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్థానం మెరుగుపర్చుకుని 12వ స్థానానికి ఎగబాకాడు.
టాప్-10 ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి కేవలం విరాట్ కోహ్లికి మాత్రమే చోటు దక్కింది. విరాట్.. ఇటీవల భారత్ ఆడిన మూడు టెస్ట్‌లకు దూరంగా ఉన్నా తన ఏడో ర్యాంక్‌ను పదిలంగా కాపాడుకున్నాడు. భారత్‌తో సిరీస్‌లో పేలవ ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండు స్థానాలు కోల్పోయి ఐదో ప్లేస్‌కు పడిపోగా.. న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ నాలుగు నుంచి మూడుకు.. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఐదు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకారు.
సౌతాఫ్రికాతో సిరీస్‌లో వరుస సెంచరీలతో విజృంభించిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాప్ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకోగా.. ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నే ఓ స్థానం మెరుగుపర్చుకుని ఎనిమిదో ప్లేస్‌కు చేరగా.. భారత్‌తో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం సాధించిన ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ 12 స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్థానానికి చేరాడు.
టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. రాజ్‌కోట్ టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇరగదీసిన టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో ప్లేస్‌కు ఎగబాకగా..అదే రాజ్‌కోట్ టెస్ట్‌లో 500 వికెట్ల మైలురాయికి తాకిన రవిచంద్రన్ అశ్విన్ ఓ ప్లేస్ మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరాడు. ఈ విభాగంలో భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్ ర్యాంక్‌ను పదిలంగా కాపాడుకోగా.. రబాడ, కమిన్స్, హాజిల్‌వుడ్ 3 నుంచి 5 స్థానాల్లో నిలిచారు.
టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత ప్లేయర్లు జడేజా, అశ్విన్, అక్షర్ 1, 2, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment