'ఇక్కడ 400 టార్గెట్ కూడా ఈజీనే'
లండన్:చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ను ఓడించే సత్తా పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఉందని అంటున్నాడు ఆ దేశ మాజీ ఆటగాడు యూనిస్ ఖాన్.ఇటీవల క్రికెట్ గుడ్ బై చెప్పిన యూనిస్ ఖాన్.. తమ జట్టు ప్రదర్శనకు సంబంధించి అపారమైన విశ్వాసం వ్యక్తం చేశాడు. 'చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పై ఉన్న మెరుగైన రికార్డును కొనసాగిస్తాం. గతంలో భారత్ ను పలుసార్లు ఓడించాం.సర్ఫరాజ్ ఖాన్ నేతృత్వంలోని పాక్ మరోసారి భారత్ ను ఓడిస్తుంది' అని యూనిస్ జోస్యం చెప్పాడు.
ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ జరిగే ఇంగ్లండ్ లోని పిచ్లు చాలా బాగున్నాయంటూ కితాబు ఇచ్చాడు. బ్యాటింగ్ కు అనుకూలించే ఈ తరహా పిచ్లపై ఎంతటి లక్ష్యమైనా సునాయాసమేనని యూనిస్ పేర్కొన్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 400 టార్గెట్ ను నిర్దేశించినా ఈజీగా ఛేదించవచ్చన్నాడు. వన్డే, ట్వంటీ 20ల్లో విజయాలు సాధించాలంటే ఫీల్డింగ్ అనేది చాలా కీలకమన్నాడు. ఈ ఆధునిక క్రికెట్ లో ఫీల్డింగ్ లో మెరుగ్గా ఉన్న జట్టునే విజయాలు వరిస్తాయని యూనిస్ అభిప్రాయపడ్డాడు.