ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ఆతిథ్యమిచ్చేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని విధాల సన్నద్దమవుతోంది. ఇప్పటికే తమ స్టేడియాల పునర్నిర్మాణ పనులను కూడా పీసీబీ ప్రారంభించింది. కాగా 28 ఏళ్ల తర్వాత తొలి ఐసీసీ ఈవెంట్‌కు పాకిస్తాన్‌కు ఆతిథ్యమివ్వనుంది.
పాక్‌లో చివరగా 1996లో ఐసీసీ టోర్నీ(వన్డే వరల్డ్‌కప్) జరిగింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీని పీసీబీ ప్రతిష్టత్మకంగా తీసుకుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఈవెంట్‌లో పాల్గోనేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
భారత్ ఆడే మ్యాచ్‌లను తాత్కాలిక వేదికగా నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుంటే.. పీసీబీ మాత్రం భారత జట్టు కచ్చితంగా తమ దేశానికి రావల్సిందే అని మొండి పట్టుతో ఉంది. కాగా ఐసీసీ మాత్రం ఈ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే భారత జట్టు పాక్‌కు వెళ్తుందా లేదా అన్నది తేల్చాల్సిన బాధ్యత కొత్తగా ఎన్నికైన ఐసిసి ఛైర్మన్ జై షాపై పడింది.
ఆ బాధ్యత అతడిదే..
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టును పాకిస్తాన్‌కు పంపే బాధ్యతను జైషా తీసుకోవాలని యూనిస్ సూచించాడు.
"ఐసీసీ చీఫ్‌గా జై షా నియామకంతో క్రికెట్‌కు మరింత ఆదరణ పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అదే విధంగా భారత జట్టు పాకిస్తాన్‌కు వచ్చేవిధంగా జై షా చొరవ తీసుకోవాలి. అతడు క్రీడా స్ఫూర్తిని చూపించాల్సిన అవసరం ఉంది. అప్పుడు పాక్ జట్టు కూడా ఆడేందుకు భారత్‌కు వస్తుంది" అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో యూనిస్ ఖాన్ పేర్కొన్నాడు.
కాగా ఈ టోర్నీకి సంబంధించి డ్రాప్ట్ షెడ్యూల్‌ను కూడా ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డు పంపించింది. డ్రాప్ట్ షెడ్యూల్ ప్రకారం..ఫిబ్రవరి 19, 2025న పాకిస్తాన్- న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.
చదవండి: మళ్లీ స్కూల్‌కు వెళ్తా.. విండీస్ టూర్‌లో కూడా చదువుకున్నా: సఫారీ బౌలర్
Comments
Please login to add a commentAdd a comment