యూనిస్‌ నా పీకపై కత్తి పెట్టాడు: ఫ్లవర్‌ | Pakistan Batting Coach Grant Flower Alleged On Younis Khan Over Giving Suggestion | Sakshi
Sakshi News home page

యూనిస్‌ నా పీకపై కత్తి పెట్టాడు: ఫ్లవర్‌

Jul 3 2020 12:37 AM | Updated on Jul 3 2020 12:37 AM

Pakistan Batting Coach Grant Flower Alleged On Younis Khan Over Giving Suggestion - Sakshi

న్యూఢిల్లీ: పాక్‌ మాజీ కెప్టెన్‌ యూనిస్‌ ఖాన్‌కు సలహా ఇవ్వబోతే తన పీకపై కత్తి పెట్టాడని ఆ జట్టు మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్‌ ఆరోపించాడు. ‘పాక్‌ జట్టు తరఫున ఆసీస్‌ పర్యటనలో ఉండగా ఓ సంఘటన నన్ను బాగా కలవరపెట్టింది. బ్రిస్బేన్‌ టెస్టు సందర్భంగా నేను యూనిస్‌కు బ్యాటింగ్‌లో సలహా ఇస్తుంటే... అది అతనికి నచ్చలేదేమో ఏకంగా నా పీకపై కత్తి పెట్టేశాడు. మా పక్కనే ఉన్న మికీ ఆర్థర్‌ కలగజేసుకొని సముదాయించారు. ఈ సంఘటనతో నేను ఒక్కసారిగా ఖిన్నుడినయ్యా. కానీ కోచ్‌గా ఇదంతా నా ప్రయాణంలో భాగమే అనుకొని సరిపెట్టుకున్నాను’ అని అన్నాడు. జింబాబ్వేకు చెందిన ఫ్లవర్‌కు 2016లో కంగారూ టూర్‌లో ఈ అనుభవం ఎదురైంది. ఇతను 2015 నుంచి 2019 వరకు పాక్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. దీనిపై 42 ఏళ్ల మాజీ కెప్టెన్‌ యూనిస్‌ స్పందించలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement