
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ అజామ్‌ను టీమిండియా సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లితో పోల్చడాన్ని పాక్ బ్యాటింగ్ కోచ్ యునిస్ ఖాన్ తప్పుపట్టాడు. వీరిద్దరూ అండర్-19 జట్లకు సారథ్యం వహించడం, ప్రస్తుతం జాతీయ జట్లకు సైతం నాయకత్వం వహిస్తున్న విషయాలను అభిమానులు గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా బ్యాటింగ్ శైలి, నిలకడైన బ్యాటింగ్ తీరు, రికార్డులు.. ఇలా పలు విషయాలను తెరపైకి తీసుకొచ్చి ఇద్దరినీ పోల్చుతున్నారు. అయితే ఈ పోలికపై యూనిస్ ఖాన్ తాజాగా స్పందించాడు. (ఆ ఇద్దరిని ఔట్ చేయాలి.. ఎలా అంపైర్?)
‘ఇలా పోల్చడం సరైనది కాదు. కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్ అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఎందకుంటే అతడి సాధించిన రికార్డులు, పరుగులు చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం కోహ్లి అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక బాబర్ విషయానికి వస్తే అన్ని ఫార్మట్లలో నిలకడగా రాణిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. అయితే కోహ్లి ఈ రోజు ఏ స్థానంలో ఉన్నాడో ఐదేళ్లలో బాబర్ అజామ్ ఆ స్థానానికి కచ్చితంగా చేరుకుంటాడు’ అని యునిస్ ఖాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక పాక్ తరుపున టెస్టుల్లో పదివేల పరుగులు పూర్తి చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా యూనిస్ నిలిచిని విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో పాక్ బ్యాటింగ్ కోచ్‌గా యూనిస్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నియమించింది. (‘కోహ్లిలా ఆడాలి.. పాక్‌ను గెలిపించాలి’)
Comments
Please login to add a commentAdd a comment