రాణించిన యూనిస్‌ ఖాన్‌, మిస్బా.. ఆసీస్‌పై పాక్‌ విజయం | World Championship Of Legends 2024: Pakistan Champions Beat Australia Champions By 5 Wickets, Score Details | Sakshi
Sakshi News home page

WCL 2024 PAK Vs AUS: రాణించిన యూనిస్‌ ఖాన్‌, మిస్బా.. ఆసీస్‌పై పాక్‌ విజయం

Published Thu, Jul 4 2024 8:51 AM | Last Updated on Thu, Jul 4 2024 9:16 AM

World Championship Of Legends 2024: pakistan Champions Beat Australia Champions By 5 Wickets

వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ టోర్నీ 2024లో భాగంగా నిన్న (జులై 3) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌, పాకిస్తాన్‌ ఛాంపియన్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై పాకిస్తాన్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేయగా.. పాకిస్తాన్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

రాణించిన ఫించ్‌
టాస్‌ ఓడి పాక్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. ఓ మోస్తరు స్కోర్‌ చేసింది. ఆరోన్‌ ఫించ్‌ (40 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), కౌల్టర్‌ నైల్‌ (10 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. బెన్‌ డంక్‌ (27), ఫెర్గూసన్‌ (26 నాటౌట్‌) పర్వాలేదనిపించారు. పాక్‌ బౌలర్లలో షాహిద్‌ అఫ్రిది, షోయబ్‌ మాలిక్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సోహైల్‌ తన్వీర్‌, వాహబ్‌ రియాజ్‌, సయీద్‌ అజ్మల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

సత్తా చాటిన మిస్బా, యూనిస్‌
190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్‌.. కెప్టెన్‌ యూనిస్‌ ఖాన్‌ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మిస్బా ఉల్‌ హక్‌ (30 బంతుల్లో 46 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 19.4 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో షోయబ్‌ మక్సూద్‌ (21), షోయబ్‌ మాలిక్‌ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో బ్రెట్‌ లీ, కౌల్టర్‌ నైల్‌ చెరో 2 వికెట్లు.. జేవియర్‌ దోహర్తి ఓ వికెట్‌ పడగొట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement