ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్తాన్‌కు ఓ ఆణిముత్యం లభించింది. ఈ పర్యటనలో తొలి టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 27 ఏళ్ల పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆమిర్ జమాల్.. ఆసీస్ గడ్డపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీస్తున్నాడు.
పెర్త్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో 6 వికెట్ల ప్రదర్శనతో (మొత్తంగా 7 వికెట్లు, 10 పరుగులు) చెలరేగిన జమాల్.. ఆ తర్వాత మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో 5 వికెట్లు, 33 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న జమాల్.. తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపు అర్ధ సెంచరీ (97 బంతుల్లో 82; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు.
ఈ ఇన్నింగ్స్ ద్వారా తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించిన జమాల్.. ఆతర్వాత బౌలింగ్‌లోనూ విజృంభించి (6/69) ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను తునాతునకలు చేశాడు. జమాల్ ప్రదర్శన కారణంగా పాక్ ఈ పర్యటనలో తొలిసారి మ్యాచ్ గెలిచే అవకాశం దక్కించుకుంది.
అయితే పాక్ సెకెండ్ ఇన్నింగ్స్ 68 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి జమాల్ అందించిన సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. ఈ ఇన్నింగ్స్‌లో జమాల్ (0) ఇంకా క్రీజ్‌లోనే ఉండటంతో పాక్ అతనిపై భారీ అంచనాలే పెట్టుకుంది.
అతనికి జతగా రిజ్వాన్ (6) క్రీజ్‌లో ఉన్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జమాల్ సహా రిజ్వాన్ (88), అఘా సల్మాన్ (53) రాణించడంతో పాక్ 313 పరుగులు చేసింది. అనంతరం జమాల్ ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది.
ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్ సరసన చేసిన పాక్ సంచలన ఆల్‌రౌండర్
పాక్ సంచలన ఆల్‌రౌండర్ ఆమిర్ జమాల్.. దిగ్గజ ఆల్‌రౌండర్లైన ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్ సరసన చేరాడు. ఆస్ట్రేలియా గడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 125 అంత కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు 15 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన పర్యాటక జట్టు ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో బోథమ్, వసీం అక్రమ్ మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు.
స్కోర్ వివరాలు..
- పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్: 313 ఆలౌట్ (రిజ్వాన్ 88, జమాల్ 82, కమిన్స్ 5/61)
- ఆస్ట్రేలియా తొల ఇన్నింగ్స్: 299 ఆలౌట్ (లబూషేన్ 60, మిచెల్ మార్ష్ 54, జమాల్ 6/69)
- పాకిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్: 68/7 (సైమ్ అయూబ్ 33, రిజ్వాన్ 6 నాటౌట్, జమాల్ 0 నాటౌట్, హాజిల్‌వుడ్ 4/9)
మూడో రోజు ఆట ముగిసే సమయానికి 82 పరుగుల ఆధిక్యంలో పాక్
మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ తొలి రెండు మ్యాచ్‌లను నెగ్గి ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment