హరారే: సీనియర్ క్రికెటర్ యూనిస్ ఖాన్ (174 బంతుల్లో 76 బ్యాటింగ్; 7 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించడంతో పాకిస్థాన్ జట్టు కోలుకుంది. అటు కెప్టెన్ మిస్బా ఉల్ హక్ (157 బంతుల్లో 52; 4 ఫోర్లు) మరోమారు తన ఫామ్ చాటుకోవడంతో జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో ప్రస్తుతం పాక్ 90 పరుగుల ఆధిక్యంలో ఉంది.
గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. క్రీజులో యూనిస్‌తో పాటు అసద్ షఫీక్ (15) ఉన్నాడు. 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇక్కట్ల పాలైన పాక్‌ను యూనిస్ తన అనుభవంతో ఆదుకున్నాడు. మిస్బా సహకారంతో నాలుగో వికెట్‌కు 119 పరుగులు జోడించాడు. అంతకుముందు జింబాబ్వే 78 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి... 327 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సయీద్ అజ్మల్ ఏడు వికెట్లతో చెలరేగాడు.
ఆదుకున్న యూనిస్ జింబాబ్వేతో తొలి టెస్టు
Published Fri, Sep 6 2013 1:59 AM | Last Updated on Sat, Mar 23 2019 8:32 PM
Advertisement
Advertisement