
8 వేల పరుగులు పూర్తి చేసిన యూనిస్ ఖాన్
అబుదాబి: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ డబుల్ సెంచరీ సాధించాడు. 344 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో ద్విశతకం పూర్తి చేశాడు.
టెస్టుల్లో 8 వేల మైలురాయిని యూనిస్ చేరుకున్నాడు. 181 పరుగుల వ్యక్తిగత స్కోరు అతడు 8 వేల పరుగులు పూర్తి చేశాడు. 93వ టెస్టులో అతడీ ఘనత సాధించాడు. జావేద్ మియందాద్(8829), ఇంజమాముల్ హక్(8829) తర్వాత 8వేల పరుగులు పూర్తి చేసిన మూడో బ్యాట్స్‌మన్ గా యూనిస్ నిలిచాడు.
ఆస్ట్రేలియా జట్టుపై 89 ఏళ్ల తర్వాత వరుసగా మూడు సెంచరీలు చేసిన ఘనత కూడా అతడు స్వంతం చేసుకున్నాడు.