
యూనిస్ అజేయు సెంచరీ
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 261/4
శ్రీలంకతో టెస్టు
గాలె: వెటరన్ బ్యాట్స్‌వున్ యూనిస్ ఖాన్ అజేయు సెంచరీ (228 బంతుల్లో 133 బ్యాటింగ్; 11 ఫోర్లు, 1 సిక్స్), అసద్ షఫీక్ అర్ధ సెంచరీ(110 బంతుల్లో 55 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్)తో రాణించడంతో గాలె టెస్టులో పాకిస్థాన్ జట్టు కోలుకుంది. శ్రీలంకతో బుధవారం మొదలైన తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 88 ఓవర్లలో 4 వికెట్లకు 261 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. దమ్మిక ప్రసాద్ దెబ్బకు ఓపెనర్లు అహ్మద్ షెహజాద్ (4), ఖుర్రమ్ వుంజూర్ (3) వికెట్లను చేజార్చుకుంది. అజహర్ అలీ (30) కాసేపు క్రీజ్‌లో ఉన్నా హెరాత్ బౌలింగ్‌లో అవుటయ్యూడు. 56 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న పాకిస్థాన్‌ను సీనియుర్ బ్యాట్స్‌వున్ యూనిస్ ఖాన్... కెప్టెన్ మిస్బావుల్ హక్ (31), అసద్ షఫీక్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు.
నాలుగో వికెట్‌కు మిస్బాతో కలిసి వంద పరుగులు జోడించిన యూనిస్ ఆ తర్వాత అభేద్యమైన ఐదో వికెట్‌కు షఫీక్‌తో కలిసి 105 పరుగుల భాగస్వావ్యుం నెలకొల్పాడు. టెస్టుల్లో యూనిస్ కిది 24వ సెంచరీ. పాకిస్థాన్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన వారిలో ఇంజమాముల్ హక్ (25) అగ్రస్థానంలో ఉన్నాడు. లంక బౌలర్లలో ప్రసాద్, హెరాత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. వురోవైపు టెస్టు కెరీర్‌లో చివరి సిరీస్ ఆడుతున్న వూజీ కెప్టెన్ జయువర్ధనెకు గాలె అంతర్జాతీయు స్టేడియుంలో స్కూల్ విద్యార్థులు బ్యాట్లను పెకైత్తి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు.