యూనిస్ ఖాన్ సెంచరీ | Younis Khan Century | Sakshi
Sakshi News home page

యూనిస్ ఖాన్ సెంచరీ

Published Sat, Oct 22 2016 4:45 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

యూనిస్ ఖాన్ సెంచరీ

యూనిస్ ఖాన్ సెంచరీ

భారీ స్కోరు దిశగా పాకిస్తాన్

 
అబుదాబి: సీనియర్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ (205 బంతుల్లో 127; 10 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్‌లో 33వ సెంచరీ సాధించడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు పాకిస్తాన్ పటిష్ట స్థితిలో నిలిచింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నిం గ్‌‌సలో 4 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది.

మిస్బావుల్ హక్ (146 బంతుల్లో 90 బ్యాటింగ్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి చేరువ కాగా, అసద్ షఫీఖ్ (68) రాణించాడు. యూనిస్, మిస్బా నాలుగో వికెట్‌కు 175 పరుగులు జోడించడం విశేషం. గాబ్రియెల్‌కు 2 వికెట్లు దక్కారుు. ఈ మ్యాచ్‌తో పాకిస్తాన్‌కు అత్యధిక టెస్టుల్లో నాయకత్వం వహించిన కెప్టెన్‌గా (48) ఇమ్రాన్ ఖాన్ రికార్డును మిస్బా సమం చేశాడు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement