వన్డేలకు యూనిస్ ఖాన్ గుడ్బై | Younis Khan to retire from ODIs after today's game | Sakshi
Sakshi News home page

వన్డేలకు యూనిస్ ఖాన్ గుడ్బై

Published Wed, Nov 11 2015 3:38 PM | Last Updated on Wed, May 29 2019 2:49 PM

వన్డేలకు యూనిస్ ఖాన్ గుడ్బై - Sakshi

వన్డేలకు యూనిస్ ఖాన్ గుడ్బై

అబుదాబి: అంతర్జాతీయ వన్డే మ్యాచ్లకు పాక్ సీనియర్ క్రికెటర్ యూనిస్ ఖాన్ గుడ్బై చెప్పాడు. 2000సంవత్సరంలో పాక్ జట్టులో చోటు సంపాదించిన యూనిస్ అంచెలంచెలుగా ఎదిగి పాక్ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. తాజాగా ఇంగ్లాండ్తో బుధవారం జరిగే మ్యాచ్ అనంతరం వన్డే ఫార్మాట్నుంచి తప్పుకుంటున్నట్లు యూనిస్ ఖాన్ ప్రకటించాడు. 2000 ఫిబ్రవరిలో కరాచీలో శ్రీలంకతో జరిగిన మ్యచ్లో వన్డే ఆరంగేట్రం చేసిన యూనిస్ పాక్ జట్టుకు 15 ఏళ్లుగా సేవలందించాడు.

264 వన్డే మ్యాచ్లాడిన యూనిస్ 7240 పరుగులు సాధించాడు. తన కెరీర్లో 7 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. నేటి మ్యాచ్ అతనికి 265వ మ్యాచ్. టెస్టుల్లో 9 వేల పరుగులు చేసిన పాక్ తొలి ఆటగాడిగా యూనిస్ నిలిచాడు. జట్టుకు అవసరమైన సేవలు చేశాను, అతి త్వరలో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తానని గతవారం చెప్పిన యూనిస్ బుధవారం వీడ్కోలు విషయాన్ని బహిర్గతం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement