
డబుల్ సెంచరీతో చెలరేగిన యూనిస్ ఖాన్
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో పాకిస్తాన్ ఆటగాడు డబుల్ సెంచరీతో సాధించాడు. మూడో రోజు రెండో సెషన్లో యూనిస్ ఖాన్ 195 పరుగుల వద్ద సిక్స్ బాది డబుల్ సెంచరీ (281 బంతుల్లో 201 బ్యాటింగ్; 29 ఫోర్లు; 4 సిక్స్) పూర్తి చేసుకున్నాడు. మరో ఆటగాడు అసద్ షఫీఖ్ సెంచరీతో (179 బంతుల్లో 109; 12 ఫోర్లు; 2 సిక్సర్లు) రాణించడంతో పాక్ భారీ స్కోరు దిశగా సాగుతోంది.
ప్రస్తుతానికి పాక్ 133 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి 491 పరుగులు చేసింది. ప్రస్తుతం యూనిస్ 203 నాటౌట్, మహమ్మద్ ఆమీర్ 14 నాటౌట్ క్రీజులో ఉన్నారు. పాక్ ఆధిక్యం పెరిగితే ఇంగ్లండ్ కు కష్టాలు తప్పవు. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 76.4 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొయిన్ అలీ (108) శతకం సాధించాడు. ఈ సిరీస్ లో ఇంగ్లండ్ రెండు టెస్టులు గెలవగా, పాక్ ఒక్క టెస్టులో నెగ్గింది.