Asia Cup 2022: Rohit Sharma Shares Special Message For Fans Video - Sakshi
Sakshi News home page

Asia Cup 2022- Rohit Sharma: ప్రపంచాన్ని గెలిచేద్దాం.. అంతకంటే ముందు.. రోమాలు నిక్కబొడుచుకునేలా వీడియో!

Published Thu, Aug 4 2022 1:45 PM | Last Updated on Thu, Aug 4 2022 3:10 PM

Asia Cup 2022: Rohit Sharma Shares Special Message For Fans Video - Sakshi

రోహిత్‌ శర్మ(PC: Star Sports)

Asia Cup 2022- Rohit Sharma Video Viral: ‘‘ఏడుసార్లు ఆసియా కప్‌ గెలవడం.. ప్రపంచంలో నంబర్‌ జట్టుగా పేరొందడం... సరికొత్త ప్రపంచ రికార్డులు సృష్టించడం. వీటన్నింటినీ మించి.. 140 కోట్ల మంది అభిమానులు.. ‘‘ఇండియా.. ఇండియా’’ అని ముక్తకంఠంతో నినదిస్తుంటే వినడం కంటే గొప్ప అనుభూతి ఏదీ ఉండదు. రండి.. ప్రపంచాన్ని గెలిచేద్దాం.. అంతకంటే ముందు ఆసియాలో త్రివర్ణ పతాకం రెపరెపలాడిద్దాం’’ అంటూ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభిమానులకు పిలుపునిచ్చాడు. 

టీ20 ప్రపంచకప్‌-2022 గెలవడమే అంతిమ లక్ష్యమని.. అంతకంటే ముందు ప్రతిష్టాత్మక ఆసియా కప్‌ గెలుద్దామని, అందుకు మీ మద్దతు కావాలంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఇన్నాళ్లుగా తమకు అండగా ఉంటున్నందుకు థాంక్యూ ఇండియా అంటూ ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు రోహిత్‌ ఉద్వేగపూరితంగా మాట్లాడిన వీడియోను బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్ సోషల్‌ మీడియాలో వదిలింది. 

ఇందుకు స్పందించిన అభిమానులు.. ‘‘ఈ వీడియో చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. భారత్‌ మరోసారి ఆసియా కప్‌ గెలవాలి’’ అంటూ టీమిండియాకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు. కాగా ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌కు అద్భుత రికార్డు ఉంది. ఇప్పటి వరకు టీమిండియా ఏడుసార్లు విజేతగా నిలిచింది.

కాగా ఈ టోర్నీలో భారత్‌తో పాటు శ్రీలంక, పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ పోటీపడతాయన్న సంగతి తెలిసిందే. దుబాయ్‌, షార్జా వేదికగా ఆగష్ట 27 నుంచి ఈ మెగా ఈవెంట్‌ మొదలుకానుంది. ఇక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఆగష్టు 28న జరుగనుంది.

టీ20 ఫార్మాట్‌లో జరుగనున్న ఈ టోర్నీని ప్రపంచకప్‌-2022కు సన్నాహక ఈవెంట్‌గా భావిస్తున్న తరుణంలో రోహిత్ ఈ మేరకు సందేశం విడుదల చేయడం విశేషం. ఇక ప్రస్తుతం రోహిత్‌ సేన వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా ఉంది.

చదవండి: Asia Cup 2022 Schedule: ఆసియా కప్‌-2022 షెడ్యూల్‌ ఇదే!
Zim Vs Ban: మరీ జింబాబ్వే చేతిలోనా.... అస్సలు ఊహించలేదు! మాకిది ఘోర అవమానం!
Asia Cup 2022: మౌకా.. మౌకా యాడ్‌కు మంగళం పాడిన స్టార్‌ స్పోర్ట్స్‌.. కారణం అదేనా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement