
రావల్పిండి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్తాన్ విజయం దిశగా పయనిస్తోంది. పాక్ స్పిన్నర్ల దాటికి పర్యాటక ఇంగ్లీష్ జట్టు విల్లవిల్లాడుతోంది. 77 పరుగుల లోటు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ తడబడుతోంది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇంకా 53 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో జో రూట్(5), హ్యారీ బ్రూక్ ఉన్నారు. పాక్ స్పిన్నర్లు నోమన్ అలీ రెండు వికెట్లు పడగొట్టగా.. సాజిద్ ఖాన్ వికెట్ సాధించాడు.
షకీల్ సూపర్ సెంచరీ..
అంతకుముందు పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌటైంది. పాక్ వైస్ కెప్టెన్ సౌద్ షకీల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కష్టాల్లో ఉన్న జట్టును తన సెంచరీతో షకీల్ గట్టెక్కించాడు. 223 బంతులు ఎదుర్కొన్న షకీల్ 5 ఫోర్లతో 134 పరుగులు చేసి ఔటయ్యాడు.
అతడితో పాటు టెయిలాండర్లు నోమన్ అలీ(45), సాజిద్ ఖాన్(48) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రెహాన్ ఆహ్మద్ 4 వికెట్లతో మెరవగా.. షోయబ్ బషీర్ మూడు, అట్కినసన్ రెండు వికెట్లు సాధించారు. కాగా ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 267 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.
చదవండి: Asia T20 Cup: చెలరేగిన బ్యాటర్లు.. సెమీస్‌లో లంక చేతిలో పాక్ చిత్తు
Comments
Please login to add a commentAdd a comment