
రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ బ్యాటర్లు దుమ్ములేపారు. మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 6 వికెట్ల నష్టానికి 448 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
158/4 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజును ఆట ప్రారంభించిన పాక్ జట్టు అదనంగా మరో 290 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్, వైస్ కెప్టెన్ సౌద్ షకీల్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు.
రిజ్వాన్ 174 పరుగులతో ఆజేయంగా నిలవగా.. షకీల్ 141 పరుగులు చేశాడు. వీరిద్దరితో పాటు అయూబ్(56) హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే టాపర్డర్ బ్యాటర్లు షఫీక్(2), షాన్ మసూద్(6), బాబర్ ఆజం(0) నిరాశ పరిచారు.
ఇక బంగ్లా బౌలర్లలో షోర్‌ఫుల్ ఇస్లాం, హసన్ మహ్ముద్ తలా రెండు వికెట్లు సాధించగా.. షకీబ్, మెహదీ హసన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో షద్మాన్ ఇస్లాం(12), జాకిర్ హోస్సేన్(11) పరుగులతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment