రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ వికెట్‌కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ సెంచరీతో కదంతొక్కాడు. రిజ్వాన్ తన సెంచరీ మార్కును 143 బంతుల్లో తాకాడు. రిజ్వాన్ కెరీర్‌లో ఇది మూడో టెస్ట్ శతకం. ప్రస్తుతం రిజ్వాన్ 147 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 75 ఓవర్లు ముగిసే సరికి పాక్ స్కోర్ 277/గా ఉంది. రిజ్వాన్‌కు జతగా క్రీజ్‌లో ఉన్న సౌద్ షకీల్ కూడా సెంచరీకి చేరువయ్యాడు. షకీల్ 182 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 92 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు.
కాగా, పాక్ 158/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించింది. తొలి రోజు ఆటలో పాక్ అబ్దుల్లా షఫీక్ (2), సైమ్ అయూబ్ (56), షాన్ మసూద్ (6), బాబర్ ఆజమ్ (0) వికెట్లు కోల్పోయింది. బంగ్లా బౌలర్లలో షోరీఫుల్ ఇస్తాం, హసన్ మహ్మూద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. రెండో రోజు బంగ్లాదేశ్ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో సౌద్ షకీల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. పాక్ తరఫున వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. షకీల్ 1000 పరుగుల మార్కును తాకేందుకు 20 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. 1959లో సయీద్ అహ్మద్ కూడా ఇన్నే ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగుల మైలురాయిని తాకాడు.
Comments
Please login to add a commentAdd a comment