ICC Cricket World Cup 2023, 2nd Match- - Pakistan vs Netherlands: నెదర్లాండ్స్‌తో మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ చరిత్ర సృష్టించారు. ప్రపంచకప్ ఈవెంట్లో నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన పాక్ బ్యాటర్ల జోడీలో నాలుగో స్థానంలో నిలిచారు.
అదే విధంగా.. వన్డే వరల్డ్‌కప్ అరంగేట్రంలోనే ఒకే మ్యాచ్‌లో యాభైకి పైగా పరుగులు సాధించిన బ్యాటర్లుగా చరిత్రకెక్కారు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో ఆడుతోంది.
అర్ధ శతకాలతో ఆదుకున్నారు
అయితే, పసికూనే కదా అని డచ్ జట్టును తక్కువగా అంచనా వేసిన బాబర్ ఆజం బృందానికి ఆరంభంలోనే షాక్ తగిలింది. హైదరాబాద్‌లో 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ అద్భుత ఆట తీరుతో పాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు.
అర్ధ శతకాలతో చెలరేగి నాలుగో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో ఐసీసీ ప్రపంచకప్ ఈవెంట్లో నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన నాలుగో జోడీగా రికార్డు సాధించారు.
అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు
అంతకు ముందు.. 1983లో నాటింగ్‌హాంలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఇమ్రాన్ ఖాన్, జహీర్ అబ్బాస్ 147* పరుగులు, అదే టోర్నీలో లీడ్స్ మ్యాచ్‌లో షాహిద్ మహబూబ్‌తో కలిసి ఇమ్రాన్ ఖాన్ 144.. 2019లో బర్మింగ్‌హాంలో బాబర్ ఆజం- హ్యారిస్ సొహైల్ 126 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
ఇక వరల్డ్‌కప్ డెబ్యుటెంట్స్ ఒకే మ్యాచ్‌లో ఫిఫ్టీ ప్లస్ సాధించిన పాక్ ఆటగాళ్ల జాబితాలో మజీద్ ఖాన్(65), ఆసిఫ్ ఇక్బాల్(53)(1975లో ఆస్ట్రేలియా మీద), మిస్బా ఉల్‌హక్(65), ఉమర్ అక్మల్(71)- (2011లో కెన్యా మీద) తర్వాతి స్థానాల్లో రిజ్వాన్(65), సౌద్ షకీల్(68)-(2023లో హైదరాబాద్‌లో) నిలిచారు.
చదవండి: పాకిస్తాన్‌కు ఘోర ఓటమి.. ఫైనల్లో టీమిండియాతో అఫ్గన్
Comments
Please login to add a commentAdd a comment