వన్డే ప్రపంచకప్-2023ను పాకిస్తాన్ క్రికెట్ జట్టు విజయంతో ఆరంభించింది. హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది.
పాక్ ఇన్నింగ్స్‌లో టాపర్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికి మిడిలార్డర్ ఆటగాళ్లు మహ్మద్ రిజ్వాన్(68), సౌధ్ షకీల్(68) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 120 పరుగుల కీలక భాగస్వామ్యంం నెలకొల్పారు.
డచ్ బౌలర్లలో బాస్‌డి లీడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అకెర్‌మెన్ రెండు,వాన్ బీక్, అర్యన్ దత్, వాన్ మీకరన్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో డచ్ జట్టు 41 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్ బౌలర్లలో హ్యారిస్ రవూఫ్ మూడు వికెట్లు, హసన్ అలీ రెండు వికెట్లు సాధించారు.
మిగితా బౌలర్లు షాహీన్ అఫ్రిది, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షదాబ్ ఖాన్ తలా వికెట్ పడగొట్టారు. నెదర్లాండ్స్ బ్యాటర్లలో బాస్ డిలీడ్(67) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం స్పందించాడు. తమ బౌలర్ల వల్ల ఈ గెలుపు దక్కిందని బాబర్ తెలిపాడు.
"హైదరాబాద్‌లో అభిమానులు మా జట్టును ఆదరిస్తున్న తీరు చాలా సంతోషంగా ఉంది. మేము ఇక్కడ ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తున్నాం. మాకు ఇది చాలా సంతృప్తినిచ్చింది. అందరికి ధన్యవాదాలు. ఇక మ్యాచ్ గురించి మాట్లాడితే ముందుగా విన్నింగ్ క్రెడిట్ బౌలర్లకు ఇవ్వాలనకుంటున్నాను. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.
సెకెండ్ ఇన్నింగ్స్‌లో మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అదేవిధంగా మిడిల్ ఓవర్లలో కూడా వికెట్లు సాధించారు. యారిస్ రవూఫ్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను టర్న్ చేశాడు. బ్యాటింగ్‌లో వరుస క్రమంలో మూడు వికెట్లు కోల్పోయాం.
ఆ సమయంలో రిజ్వాన్, షకీల్ ఆడిన తీరు అద్భుతం. వారిద్దరూ నెదర్లాండ్స్ బౌలర్లపై ఒత్తడి పెంచారు. ముఖ్యంగా అంతగా అనుభవం లేని షకీల్ ఆడిన విధానం నన్ను ఎంతగానో అకట్టుకుంది. తమ తర్వాతి మ్యాచ్‌ల్లో కూడా ఇదే రిథమ్‌ను కొనసాగిస్తామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో బాబర్ పేర్కొన్నాడు.
చదవండి: ‘డచ్’ పని పట్టిన పాక్
Comments
Please login to add a commentAdd a comment