పాకిస్తాన్ వైట్ బాల్ కెప్టెన్సీకి స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వర్క్‌లోడ్ కారణంగా కెప్టెన్సీ నుంచి బాబర్ తప్పుకున్నాడు. ఈ క్రమంలో కొత్త కెప్టెన్‌ను వెతికే పనిలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పడింది. తమ సొంత గడ్డపై జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ముందు నూతన సారథిని ఎంపిక చేయాలని పీసీబీ భావిస్తోంది.
అయితే బాబర్ వారుసుడిగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పీసీబీ నుంచి ఎటువంటి ఆధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా పాక్ కెప్టెన్సీ ఎంపిక సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే పీసీబీ తమ జట్టు కెప్టెన్సీ రోల్ కోసం ముగ్గురు ఆటగాళ్లని షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అందులో మహ్మద్ రిజ్వాన్ పేరు లేదంట. జియో సూపర్ ఛానల్ రిపోర్ట్ ప్రకారం.. మొహ్సిన్ నఖ్వీ నేతృత్వంలోని పాక్ క్రికెట్ బోర్డు తమ కెప్టెన్సీ కోసం సౌద్ షకీల్, ఫఖర్ జమాన్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కెప్టెన్‌గా అతడే?
కాగా ఫఖర్ పేరును పరిగణలోకి తీసకున్నప్పటకి బోర్డు పెద్దలు మాత్రం షకీల్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాక్ వైస్ కెప్టెన్‌గా షకీల్ బాధ్యతలు నిర్వర్తించాడు.
పాక్ ఘోర పరాభావం పొందినప్పటకి షకీల్ మాత్రం తన ప్రదర్శనలతో ఆకట్టకున్నాడు. ఈ క్రమంలోనే తమ జట్టు వైట్ బాల్ కెప్టెన్సీని అప్పగించాలని పీసీబీ భావిస్తుందంట. మరోవైపు రిజ్వాన్ కెప్టెన్‌గా నియమించడాన్ని వర్క్‌లోడ్ కారణంగా ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ వ్యతిరేకిస్తున్నట్లు వినికిడి. కాగా పాక్ జట్టు స్వదేశంలో ఇంగ్లండ్ టెస్టు సిరీస్ అనంతరం పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఈ పర్యటనకు ముందు పాక్‌కు కొత్త కెప్టెన్ వచ్చే ఛాన్స్ ఉంది.
చదవండి: మూడు నెలలుగా జీతాల్లేవు!.. నిధులన్నీ వాటికే?
Comments
Please login to add a commentAdd a comment