ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో పాకిస్తాన్-ఎ కథ ముగిసింది. అల్ అమెరత్ వేదికగా శ్రీలంక-ఎతో జరిగిన తొలి సెమీఫైనల్లో 7 వికెట్ల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది. 136 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 3 వికెట్లు కోల్పోయి 17.2 ఓవర్లలో ఊదిపడేసింది.
లంక బ్యాటర్లలో అహన్ విక్రమసింఘే(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. లహిరు ఉదరా(43) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో సుఫియాన్ ముఖీమ్, అబ్బాస్ అఫ్రిది తలా వికెట్ మాత్రమే సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 135 పరుగులకే విఫలమైంది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ యూసఫ్(68) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. లంక బౌలర్లలో స్పిన్నర్ హేమంత 4 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించగా.. ఇషాన్ మలింగ, రన్షిక తలా రెండు వికెట్లు పడగొట్టారు.
మలింగ సూపర్ యార్కర్..
అయితే ఈ మ్యాచ్‌లో లంక స్పీడ్ స్టార్ ఇషాన్ మలింగ సంచలన బంతితో మెరిశాడు. పాక్ కెప్టెన్ మహ్మద్ హ్యారీస్‌ను అద్భుతమైన యార్కర్‌తో మలింగ క్లీన్ బౌల్డ్ చేశాడు. పాక్ ఇన్నింగ్స్ 6 ఓవర్‌లో మలింగ ఆఖరి బంతిని వేసే క్రమంలో హ్యారీస్ ముందుగానే తన కుడి వైపునకు వెళ్లి ర్యాంప్ షాట్ ఆడాలనకున్నాడు.
ఇది గమనించిన ఎషాన్ మలింగ చాలా తెలివిగా మిడిల్ అండ్ లెగ్‌పై అద్భుతమైన యార్కర్‌ను బౌల్ చేశాడు. బుల్లెట్‌లా దూసుకు వచ్చిన బంతిని కనక్ట్ చేయడంలో పాక్ కెప్టెన్ విఫలమయ్యాడు. దీంతో బంతి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Ehsan Malinga gets the big fish with a peach of a delivery 🫡@OfficialSLC#MensT20EmergingTeamsAsiaCup2024 #SLvPAK #ACC pic.twitter.com/SK54SWEbdY
— AsianCricketCouncil (@ACCMedia1) October 25, 2024
Comments
Please login to add a commentAdd a comment