టీ20 వరల్డ్‌కప్-2024ను బంగ్లాదేశ్ విజయంతో ఆరంభించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది. శ్రీలంక ఆఖరి వరకు పోరాడనప్పటికి విజయం మాత్రం బంగ్లానే వరించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.
లంక బ్యాటర్లలో ఓపెనర్ నిస్సాంక(47) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ధనుంజయ డి సిల్వా(21), అసలంక(19) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హోస్సేన్, ముస్తఫిజుర్ రెహ్మాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. టాస్కిన్ అహ్మద్ రెండు, టాంజిమ్ హసన్ షకీబ్ ఒక్క వికెట్ సాధించారు.
అనంతరం 125 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 19 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో తౌహిద్ హృదయ్(40), లిటన్ దాస్(36) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలవగా.. ఆఖరిలో మహ్మదుల్లా(16) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో నువాన్ తుషారా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హసరంగా రెండు, పతిరాన ఒక్క వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment