IRE Vs SA: South Africa Won The First T20 Match Against Ireland By 21 Runs - Sakshi
Sakshi News home page

Ireland Vs South Africa: తొలి టి20లో దక్షిణాఫ్రికా గెలుపు 

Published Fri, Aug 5 2022 2:42 AM | Last Updated on Fri, Aug 5 2022 9:07 AM

South Africa Won The First T20 Match Against Ireland By 21 Runs - Sakshi

బ్రిస్టల్‌: ఐర్లాండ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రీజా హెన్‌డ్రిక్స్‌ (53 బంతుల్లో 74; 10 ఫోర్లు, 1 సిక్స్‌), ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (27 బంతుల్లో 56; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేశారు.

అనంతరం ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులే చేయగలిగింది. లార్కన్‌ టకర్‌ (38 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, జార్జ్‌ డాక్‌రెల్‌ (28 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. సిరీస్‌లో చివరిదైన రెండో టి20 మ్యాచ్‌ నేడు జరుగుతుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement