Ireland Vs South Africa, 2nd T20I: South Africa Beat Ireland By 44 Runs - Sakshi
Sakshi News home page

Wayne Parnel: ఐదు వికెట్లతో చెలరేగిన బౌలర్‌.. అల్లాడిపోయిన ఐర్లాండ్‌

Published Sat, Aug 6 2022 8:31 AM | Last Updated on Sat, Aug 6 2022 10:26 AM

Wayne Parnel 1st 5-Wicket Haul SA Beat Ireland 44 Runs Win Series 2-0 - Sakshi

ఐర్లాండ్‌తో తొలి టి20లో కష్టపడి విజయం సాధించిన సౌతాఫ్రికా రెండో టి20 మ్యాచ్‌లో విజృంభించింది. ప్రొటిస్‌ బౌలర్‌ వేన్‌ పార్నెల్‌ ఐదు వికెట్లతో చెలరేగడంతో లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌ అల్లాడిపోయింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. కాగా పార్నెల్‌కు టి20ల్లో ఇదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన. మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రీజా హెండ్రిక్స్‌ 42 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్‌ 39, మిల్లర్‌ 34 నాటౌట్‌ రాణించారు. ఐర్లాండ్‌ బౌలరల్లో డెలాని 2 వికెట్లు తీశాడు.

అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ 18.5 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలి 44 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఐర్లాండ్‌ బ్యాటర్స్‌లో హారి టెక్టార్‌ 34, బారీ మెక్‌కార్తి 32, పాల్‌ స్టిర్లింగ్‌ 28 పరుగులు సాధించారు. పార్నెల్‌ 5 వికెట్లు తీయగా..డ్వేన్‌ ప్రిటోరియస్‌ 3, ఎంగిడి, షంసీ చెరొక వికెట్‌ తీశారు. పార్నెల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. రీజా హెండ్రిక్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.

చదవండి: BBL Vs ILT 20: ఆటగాళ్లకు కోట్లలో ఆఫర్‌.. సొంత లీగ్‌కు తూట్లు పొడిచే యత్నం!

NED vs NZ: పసికూనపై కివీస్‌ ప్రతాపం.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement