పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సౌతాఫ్రికా ఇటీవలికాలంలో ఘోర ప్రదర్శనలు చేస్తుంది. టీ20 వరల్డ్‌కప్ అనంతరం ఆ జట్టు వెస్టిండీస్ (టీ20 సిరీస్‌లో 0-3 తేడాతో ఓటమి), ఆఫ్ఘనిస్తాన్ (వన్డే సిరీస్‌లో 1-2 తేడాతో ఓటమి) లాంటి సాధారణ జట్ల చేతుల్లో దారుణ పరాజయాలు మూటగట్టుకుంది.
తాజాగా సౌతాఫ్రికా క్రికెట్ పసికూన ఐర్లాండ్ చేతుల్లోనూ ఓటమిపాలైంది. రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికాపై ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఐర్లాండ్ రెండు మ్యాచ్ సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. టీ20ల్లో ఐర్లాండ్‌కు సౌతాఫ్రికాపై ఇదే తొలి విజయం.
THE HISTORIC MOMENT FOR IRELAND.
- First time ever Ireland beat South Africa in a T20i match. 🇮🇪pic.twitter.com/Hp6BtushbB— Mufaddal Vohra (@mufaddal_vohra) September 30, 2024
మెరుపు శతకంతో అలరించిన రాస్ అదైర్
అబుదాబీ వేదికగా సౌతాఫ్రికాతో నిన్న (సెప్టెంబర్ 29) జరిగిన రెండో టీ20లో ఐర్లాండ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. అదైర్ బ్రదర్స్ బ్యాట్‌తో, బంతితో చెలరేగి ఐర్లాండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. రాస్ అదైర్ మెరుపు శతకంతో (58 బంతుల్లో 100; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో పాల్ స్టిర్లింగ్ (31 బంతుల్లో 52) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్దర్ 2, ఎంగిడి, విలియమ్స్, క్రుగెర్ తలో వికెట్ పడగొట్టారు.
బంతితో చెలరేగిన మార్క్ అదైర్
196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మార్క్ అదైర్ (4-0-31-4), గ్రహం హ్యూమ్ (4-0-25-3) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 185 పరుగులు మాత్రమే చేయగలిగింది. మాథ్యూ హంఫ్రేస్, బెంజమిన్ వైట్ తలో వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్ (51), మాథ్యూ బ్రీట్జ్కీ (51) అర్ద సెంచరీలతో రాణించారు. వీరిద్దరితో పాటు సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ర్యాన్ రికెల్టన్ (36) ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
చదవండి: ఐదో వన్డేలో ఆసీస్ విజయం.. సిరీస్ కైవసం
Comments
Please login to add a commentAdd a comment