South Africa Clinches Super Victory Against Ireland ODI Series Draw - Sakshi
Sakshi News home page

SA vs IRE: దుమ్మురేపిన ఓపెనర్లు; సఫారీ ఘన విజయం

Published Sat, Jul 17 2021 7:26 AM | Last Updated on Sat, Jul 17 2021 11:12 AM

South Africa Clinches Super Victory Against Ireland ODI Series Draw - Sakshi

డబ్లిన్‌: దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌ జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 70 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్లకు 346 పరుగులు చేసింది. ఓపెనర్లు జేన్‌మన్‌ మలాన్‌ (169 బంతుల్లో 177; 16 ఫోర్లు, 6 సిక్స్‌లు), క్వింటన్‌ డికాక్‌ (91 బంతుల్లో 120; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకాలతో చెలరేగారు.

వీరిద్దరు తొలి వికెట్‌కు 225 పరుగులు జోడించారు. ఛేజింగ్‌లో ఐర్లాండ్‌ 47.1 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. సిమీ సింగ్‌ సెంచరీ (91 బంతుల్లో 100 నాటౌట్‌; 14 ఫోర్లు)తో ఐర్లాండ్‌ గెలుపు కోసం ఒంటరి పోరాటం చేశాడు. ఫెలుక్వాయో, షమ్సీ చెరో మూడు వికెట్లు తీశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement