రహస్యంగా వీడియో తీసి...
లండన్: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్ పాడు పనులకు పాల్పడి బ్రిటన్ లో జైలు పాలయ్యాడు. రహస్యంగా టీనేజర్లను అభ్యంతకరంగా చిత్రీకరించి తీసి జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. నిందితుడు జొనాథన్ థామ్సన్-గ్లొవర్(53)కు కోర్టు సుమారు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.
బ్రిస్టల్ లోని క్లిఫ్టన్ కాలేజీలో 16 ఏళ్లపైగా పనిచేసిన థామ్సన్ 12 నుంచి 17 ఏళ్ల వయసున్న 120 టీనేజర్లను రహస్యంగా వీడియో తీశాడు. స్నానాలు, పడక గదుల్లో వారి కదలికలను చిత్రీకరించాడు. సెలవుల్లో పాఠశాల గోడల్లో కెమెరాలు అమర్చి వాటిని తన గదిలోని వీడియో రికార్లకు కనెక్ట్ చేశాడు. అతడి వద్ద 2500 గంటల ఫుటేజీ దొరికింది.
జర్మనీకి చెందిన థామ్సన్ ను యూకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ గతేడాది అరెస్ట్ చేసింది. టీనేజర్లకు చెందిన అభ్యంతకర చిత్రాలను డౌన్ చేస్తున్నారన్న నేరంపై అతడిని అదుపులోకి తీసుకోగా రహస్య చిత్రీకరణ విషయం బయటపడింది. దోషిగా తేల్చిన టాండన్ క్రౌన్ కోర్టు.. అతడికి మూడు ఏళ్ల 9 నెలల జైలు శిక్ష విధించింది.