వర్షంతో తొలి వన్డే రద్దు | Bristol ODI: Rain washes out Ind-Eng ODI series opener | Sakshi
Sakshi News home page

వర్షంతో తొలి వన్డే రద్దు

Published Tue, Aug 26 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM

వర్షంతో తొలి వన్డే రద్దు

వర్షంతో తొలి వన్డే రద్దు

- రెండో వన్డే బుధవారం  
- ఆ మ్యాచ్‌కూ వరుణుడి గండం
బ్రిస్టల్: భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం జరగాల్సిన తొలి వన్డే రద్దయింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఉదయం కొద్దిసేపు ఆగినా మళ్లీ మొదలై మధ్యాహ్నం వరకు ఆగలేదు. దీంతో మ్యాచ్ రద్దయినట్లు ప్రకటించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం కార్డిఫ్‌లో జరుగుతుంది. అయితే బుధవారం ఆ నగరంలోనూ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement