Oneday Series
-
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ రద్దు.. ప్రపంచకప్ రేసు నుంచి దక్షిణాఫ్రికా ఔట్..?
-
Shikhar Dhawan: ధవన్ ఖాతాలో అరుదైన రికార్డు..
పూణే: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో తృటిలో సెంచరీని(98) చేజార్చుకున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ అరుదైన ఘనతను సాధించాడు. ఆసియాలో అత్యధిక పరుగులు చేసిన భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ల జాబితాలో అతను ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ (10589), యువరాజ్ సింగ్ (7954), గౌతమ్ గంభీర్ (7327), సురేష్ రైనా (5027) ధవన్ కంటే ముందున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ ద్వారా ధవన్ ఆసియాలో 5000 పరుగులు పూర్తి చేశాడు. ఓవరాల్‌గా(అన్ని ఫార్మాట్లు కలిపి) ధవన్ అంతర్జాతీయ క్రికెట్లో 12000కు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 24 శతకాలు, 48 అర్ధశతాకలు ఉన్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఆచితూచి ఆడుతూ.. చెత్త బంతులను బౌండరీలు తరలిస్తూ పరుగులు రాబట్టారు. వీరి జోడీ తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. ఆతర్వాత క్రమం తప్పకుండా వికెట్లుకోల్పోవడంతో టీమిండియా 42 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 227 పరుగుల సాధించింది. రోహిత్(42 బంతుల్లో 28; 4 ఫోర్లు), కోహ్లి(60 బంతుల్లో 56; 6 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్(9 బంతుల్లో 6; ఫోర్), ధవన్(106 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్ధిక్(9 బంతుల్లో 1) అవుటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 3, మార్క్ వుడ్‌కు 2 వికెట్లు దక్కాయి. చదవండి: మాన్యా సింగ్ స్ఫూర్తిదాయక కథపై శిఖర్ ధావన్ స్పందన అరంగేట్రంలోనే కృనాల్ పాండ్యా ప్రపంచ రికార్డు.. -
శుబ్‌మన్ గిల్‌పైనే అందరి దృష్టి
తిరువనంతపురం: భారత సీనియర్ జట్టులో చోటు ఆశిస్తున్న కొందరు యువ ఆటగాళ్లకు సొంతగడ్డపై ‘ఎ’ సిరీస్ రూపంలో మరో అవకాశం లభించింది. భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ మధ్య ఐదు అనధికారిక వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు తొలి మ్యాచ్ జరుగుతుంది. ఇటీవల అద్భుత ఫామ్‌లో ఉన్నా... దురదృష్టవశాత్తూ విండీస్‌తో సిరీస్‌లో ఎంపిక కాలేకపోయిన శుబ్‌మన్ గిల్‌పైనే అందరి దృష్టి నిలిచింది. ఈ సిరీస్‌లోనూ రాణిస్తే అతను మళ్లీ సీనియర్ జట్టులోకి రావడం ఖాయం. ప్రపంచకప్‌లో గాయంతో అనూహ్యంగా దూరమైన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కూడా తన ఫిట్నెస్ను నిరూపించుకునేందుకు ఈ సిరీస్‌ను ఉపయోగించుకోనున్నాడు. విండీస్‌తో సిరీస్ విజయంలో భాగంగా ఉన్నా... చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే, లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌లు కూడా తిరిగి ఫామ్‌లోకి రావడం ‘ఎ’ సిరీస్ సరైన వేదిక కానుంది. ఇతర సీనియర్ జట్టు సభ్యులు కృనాల్, ఖలీల్ అహ్మద్, దీపక్ చహర్ కూడా ఈ సిరీస్ బరిలోకి దిగుతున్నారు. మరో వైపు దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టులో తెంబా బవుమా, హెండ్రిక్స్, క్లాసెన్, నోర్జేవంటి గుర్తింపు పొందిన అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. ఈ నెల 31న రెండో వన్డే, ఆ తర్వాత సెప్టెంబర్ 2, 4, 6 తేదీల్లో మిగిలిన మూడు వన్డేలు జరుగుతాయి. -
రాంచీ వన్డేలో ఆస్ట్రేలియా విజయం
-
ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా
-
కోహ్లి సేన అరుదైన రికార్డు సృష్టించే ఛాన్స్!
-
విండీస్‌కు అది వండర్ఫుల్ విజయం
వన్డే క్రికెట్ ఇప్పటికీ ఓ వండర్.. టీ20 వంటి ఫాస్ట్ ఫార్మాట్రంగ ప్రవేశం చేసిన తర్వాత కూడా స్పీడ్ తరగని థండర్.వన్డే ఎక్కడ జరిగినా స్టేడియంలో పోటెత్తే అభిమానులసాక్షిగా తరగని థ్రిల్‌కు ఈ మ్యాచ్ ఆలవాలం. నేటికీటీవీలకు కళ్లప్పగించి మ్యాచ్‌లో మమేకమయ్యే జనమేఅందుకు నిదర్శనం. అనుకోని ఫలితాలే ఈ థ్రిల్కుఆలంబన అని ఏ అభిమానిని అడిగినా చెబుతాడు. అటువంటి మ్యాచ్‌ల జాబితా కూడా వల్లె వేస్తాడు. అలాటిఅనుకోని ఫలితమే విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలోఅయిదేళ్ల కిందట చోటుచేసుకుంది. అప్పటికే గతి తప్పినవెస్టిండీస్ జట్టు జోరుమీద ఉన్న టీమిండియాను ఆమ్యాచ్‌లో చిత్తు చేసింది. ఇప్పుడు మరింతగాతడబడుతున్న విండీస్ జట్టు తలపుల్లో ఆ గెలుపుకచ్చితంగా కదులుతుంది. విశాఖ స్పోర్ట్స్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్డే సమరం కోసం భారత, వెస్టిండీస్ జట్లు విశాఖ చేరుకున్నాయి. మరో రోజు వ్యవధిలో సిరీస్‌లో రెండో వన్డేలో గెలుపు కోసం రెండు జట్లు వైఎస్సార్ స్టేడియం వేదికగా డేనైట్ మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో గతంలో రెండు జట్లు తలపడ్డ మ్యాచ్‌లు అభిమానుల స్మృతులలో మెదలడం సహజమే. విశాఖ పాతనగరంలో ఉన్న ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో వెస్టిండీస్ భారత్‌తో ఒక మ్యాచ్ ఆడి ఓటమి చవిచూడగా.. వైఎస్సార్ స్టేడియంలో రెండు మ్యాచ్‌లలో తలపడి ఒకదానిలో ఓడి ఒకదానిని దక్కించుకుంది. హుద్‌హుద్ తర్వాత రెండు రోజులకు జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. విజయాల జోరుకు బ్రేక్ వైఎస్ఆర్ స్టేడియం ప్రారంభమైన తర్వాత వరుసగా నాలుగు వన్డేలలో విజయం సాధించి జోరుమీద ఉన్న టీమిండియాకు వెస్టిండీస్ ద్వారానే ఎదురుదెబ్బ తగిలింది. 2013లో మాత్రం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ను విండీస్ రెండు వికెట్ల తేడాతో ఓడించింది. స్టేడియంలో భారత్ ఓడిన తొలి మ్యాచ్ అదే. అంతకు ముందే విండీస్‌తో జరిగిన మరో వన్డేలో భారత్ గెలుపొందడంతో ఇప్పుడు రెండు జట్లూ విశాఖలో సమ ఉజ్జీలుగా ఉన్నట్టయింది. బుధవారం జరగనున్న మ్యాచ్‌లో గెలిచే జట్టు విశాఖలో పైచేయి సాధించినట్టవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ జోరుకు అనుభవలేమితో సతమతమవుతున్న విండీస్ బృందం అడ్డుకట్ట వేయడం కష్టమే అనుకున్నా.. వన్డేల్లో ఫలితం ఎలా ఉంటుందో ఊహించడం కష్టం కనుక ఉత్కంఠ చివరివరకు కొనసాగే అవకాశం ఉంది. మందకొడి బ్యాటింగ్ 2013 నవంబర్ 24న జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ వెస్టిండీస్ కోరిక మేరకు బ్యాటింగ్‌కు దిగింది. తొలి పది ఓవర్ల పవర్‌ప్లేలో 48 పరుగులే చేసింది. వంద పరుగుల మార్కు చేరేప్పటికి ఇరవై ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. కోహ్లీ ఈ మ్యాచ్‌లో (వైజాగ్‌లో) సెంచరీల హ్యాట్రిక్ సాధిస్తాడనుకున్న అభిమానులకు గట్టి షాక్ తగిలింది. వందో బంతి ఆడుతున్న ఈ స్టార్ బ్యాట్స్‌మన్, రామ్‌పాల్ బౌలింగ్‌లో హోల్డర్ క్యాచ్ పట్టడంతో 99 పరుగుల వద్ద సెంచరీని కోల్పోయాడు. యువరాజ్ 28 పరుగులే చేయగా, ధోనీ 40 బంతుల్లో 51పరుగులతో అజేయంగా నిలిచి కెరీర్లో ఏభయ్యో అర్థసెంచరీని అందుకున్నాడు. భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్‌మెన్ జోరు తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ తొలి రెండు వికెట్లను 23 పరుగులకే కోల్పోయినా తొలి పవర్ ప్లేలో 60 పరుగులు రాబట్టేసింది. పావెల్ 59 పరుగులు చేశాడు. సిమ్మన్స్(62)తో కలిసిన కెప్టెన్ బ్రావో (50) మిడిలార్డర్‌ను చక్కదిద్దాడు. ఈ దశలో ఏడో ఆటగానిగా 41వ ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన సామీ భారత్‌కు చుక్కలు చూపించాడు. 22 బంతుల్లో 19 పరుగులు చేస్తే గెలుపొందే స్థితికి జట్టును చేర్చాడు. అతడు అజేయంగా 63 పరుగులతో నిలవడమే కాక.. విండీస్‌కు రెండు వికెట్ల ఆధిక్యంతో చిరస్మరణీయ విజయం దక్కేలా చేశాడు. విండీస్‌కు అది వండర్ఫుల్ విజయం 2005లో వైఎస్సార్ స్టేడియం ప్రారంభమైనప్పటి నుంచి విశాఖలో గెలుపు జోరు మీద ఉన్న భారత జట్టుకు ఎనిమిదేళ్ల తర్వాత గానీ బ్రేక్ పడలేదు. వరుసగా నాలుగు వన్డేల్లో విజయం సాధించి మంచి ఊపుమీద ఉన్న టీమిండియాకు వెస్టిండీస్ ద్వారా తగిలిన షాక్ ఓ చేదు అనుభవంగా మిగిలిపోవడంతో ఆశ్చర్యం లేదు. -
జో రూట్ సెంచరీ.. భారత్‌కు టఫ్ టార్గెట్..!
లండన్ : లార్డ్స్ మైదానంలో జరుగుతున్న కీలకమైన రెండో వన్డేలో ఇంగ్లండ్ భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత ఓవర్లలో ఇంగ్లండ్ 7వికెట్లు నష్టపోయి 322 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్, బెయిర్ స్టోలు ఆరంభం నుంచే దాటిగా ఆడటంతో స్కోర్ 10 ఓవర్లలోనే 68 పరుగులకు చేరింది. ఆ తరుణంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చైనామన్ కుల్దీప్ చేతికి బంతి ఇచ్చాడు. కుల్దీప్ తన మొదటి ఓవర్ రెండో బంతికే బెయిర్ స్టో(38) ఎల్బీడబ్య్లూ రూపంలో ఫెవిలియన్‌కు పంపాడు. చైనామన్ ధాటిగా ఆడుతున్న జాసన్ రాయ్, బెయిర్ స్టో జోడిని విడదీశాడు. ఇంగ్లండ్ 69 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన జో రూట్‌తో కలిసి జాసన్ రాయ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నాం చేశాడు. కానీ, చైనామన్ కుల్దీప్ స్పిన్ మాయలో జాసన్ రాయ్ చిక్కుకున్నాడు. కుల్దీప్ వేసిన 14.1 ఓవర్లో రాయ్ భారీ షాట్ ఆడబోయి ఉమేష్‌యాదవ్‌కు క్యాచ్ ఇచ్చాడు. జో రూట్ కెప్టెన్ మోర్గాన్‌తో కలిసి స్కోర్ బోర్టును పరుగులు పెట్టించాడు. ఇదే క్రమంలో మోర్గాన్, జో రూట్లు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. కానీ, కుల్దీప్ తన స్పిన్మాయతో ఆ జోడి పని పట్టాడు. 30.3 ఓవర్లో మోర్గాన్ సిక్స్ కొట్టడానికి ప్రయత్నించి ధావన్ చేతికి చిక్కాడు. దీంతో ఇంగ్లండ్ 189 పరుగుల వద్ద మోర్గాన్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన బెన్ స్టోక్స్(5), జాస్ బట్లర్(4), మొయిన్ ఆలీ(13) ఒక్కరి తర్వాత ఒక్కరు వరుసగా ఫెవిలియన్ బాట పట్టారు. 239 పరుగులకు ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయింది. జో రూట్, డేవిడ్‌లు ఆ తర్వాత టీమిండియా బోలర్లపై విరుచుకుపడ్డారు. జో రూట్ 109 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత డేవిడ్ విల్లే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయ్యాడు. సిద్ధార్ కౌల్ వేసిన 46వ ఓవర్లో వరుసగా 4, 6, 4 కొట్టి భారీ స్కోరు పిండుకున్నాడు. జో రూట్(8ఫోర్లు, సిక్స్) 116 బంతుల్లో 113 పరుగులు చేశాడు. కీలకమైన రెండో వన్డేలో జో రూట్ ఒంటరి పోరాటం చేశాడు. డేవిడ్ 31 బంతుల్లో(5ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. టీమిండియో బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3వికెట్లు, ఉమేష్ యాదవ్, హర్ధిక్ పాండ్యా, చాహల్‌లకు చేరో వికెట్ దక్కాయి. -
మరోసారి కుల్దీప్ స్పిన్ మాయలో ఇంగ్లండ్..!
లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఇంగ్లండ్‌కు శుభారంభాన్ని అందించారు. ఆది నుంచి వికెట్ ఇవ్వకుండా జాసన్ రాయ్, బెయిర్ స్టో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. పది ఓవర్లలో ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌కు కొరకరాని కొయ్యగా మారిన చైనామన్ కుల్దీప్ యాదవ్ రంగంలోకి దిగాడు. అంతే కుల్దీప్ వేసిన 11 ఓవర్ రెండో బంతికే బెయిర్ స్టో 38 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అప్పటివరకూ క్రీజ్‌లో పాతుకుపోయిన ఇంగ్లండ్ ఓపెనర్లను చైనామన్ విడదీశాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన జోరూట్‌తో కలిసి జాసన్ రాయ్ ఇన్సింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ ఆ జోడిని కూడా కుల్దీప్ వదలలేదు. కుల్దీప్ వేసిన 15 ఓవర్ మొదటి బంతికే షాట్ కొట్టబోయి లాంగ్‌లో ఉన్న ఉమేష్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చాడు. రెండో వన్డేలో కూడా కుల్దీప్ స్పిన్ మాయలో ఇంగ్లండ్ చిక్కుకుంది. 20 ఓవరల్లో ఇంగ్లండ్ 2వికెట్లు నష్టపోయి 121 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ మోర్గాన్(18) పరుగులతో, జోరూట్‌లు(24) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కుల్దీప్ నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీశాడు. -
వన్డే సిరీస్ మనదే
-
పరువు నిలబెట్టుకోవాలని...
వడోదర: ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్‌కు భారత జట్టు సిద్ధమైంది. ఇప్పటికే 0–2తో సిరీస్ కోల్పోయిన మిథాలీ బృందం ఆదివారం జరిగే చివరి వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. అన్ని రంగాల్లో ఆధిపత్యం చలాయిస్తున్న ఆసీస్‌ను నిలువరించాలంటే భారత్ సర్వశక్తులు ఒడ్డాల్సిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు బ్యాటింగ్‌లో స్మృతి మంధాన మెరుపులు మినహా మిగతావారు ఆకట్టుకోలేకపోయారు. ఆమెకు తోడు కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, పూనమ్ రౌత్ రాణిస్తే భారత్‌కు తిరుగుండదు. మరోవైపు సీనియర్ పేసర్ జులన్ గోస్వామి గైర్హాజరీలో శిఖా పాండే, పూజ వస్త్రకర్ ప్రభావం చూపలేకపోతున్నారు. స్పిన్నర్లు ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్ కూడా ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. మరోవైపు టాపార్డర్ రాణించడంతో రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఆసీస్ ఆదివారం జరిగే పోరులోనూ గెలవాలని చూస్తోంది. రెండు వన్డేల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన బోల్టన్‌తో పాటు పెర్రీ, మూనీ, కెప్టెన్ మెగ్ లానింగ్ ఫామ్‌లో ఉండటం కంగారూలకు కలిసొచ్చే అంశం. -
చరిత్ర సృష్టించిన టీమిండియా
-
సౌతాఫ్రికాపై చారిత్రక విజయం..
శివరాత్రి పర్వదినాన క్రీడాభిమానులను సంతోషంలో ముంచెత్తుతూ టీమిండియా చారిత్రక విజయాన్ని సాధించింది. సఫారీ గడ్డపై భారత్ పాతికేళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలితాన్ని అందించింది. గతంలో ఆరు సార్లు పర్యటించినా ఒక్క వన్డే సిరీస్‌లో కూడా విజేతగా నిలవలేకపోయిన టీమిండియా ఈసారి కోహ్లి నేతృత్వంలో సగర్వంగా నిలిచింది. తొలిసారి వన్డే సిరీస్‌ను గెలుచుకొని సత్తా చాటింది. రెండేళ్ల క్రితం సొంతగడ్డపై ఎదురైన వన్డే సిరీస్ పరాజయానికి కూడా సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇరు జట్ల మధ్య చివరి వన్డే శుక్రవారం (ఫిబ్రవరి 16న) సెంచూరియన్‌లో జరుగనుంది. పోర్ట్ ఎలిజబెత్: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు వన్డేల్లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చింది. ఆరు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 4–1తో గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఐదో వన్డేలో భారత్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (126 బంతుల్లో 115; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) వన్డే కెరీర్లో 17వ సెంచరీతో సత్తా చాటాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇన్‌గిడి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం దక్షిణాఫ్రికా 42.2 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. హషీం ఆమ్లా (92 బంతుల్లో 71; 5 ఫోర్లు) ఒక్కడే పోరాడగలిగాడు. సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని పటిష్టం చేసుకుంది. రెండు రనౌట్లు... మోర్కెల్ వేసిన తొలి ఓవర్ మెయిడిన్‌తో భారత్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత శిఖర్ ధావన్ (23 బంతుల్లో 34; 8 ఫోర్లు) దూకుడు ప్రదర్శించాడు. రబడ బౌలింగ్‌లోనే ధావన్ ఔట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ మరో ఎండ్‌లో పట్టుదలగా ఆడే ప్రయత్నం చేయగా... ఫామ్‌లో ఉన్న కోహ్లి (54 బంతుల్లో 36; 2 ఫోర్లు) మాత్రం కొంత తడబాటుకు లోనయ్యాడు. రెండో వికెట్‌కు 105 పరుగులు జోడించిన తర్వాత సమన్వయ లోపం కోహ్లి రనౌట్‌కు కారణమైంది. మోర్కెల్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడిన రోహిత్ సింగిల్ కోసం ముందుకు వచ్చే ప్రయత్నం చేసి ఆగిపోయాడు. అయితే మరోవైపు నుంచి కోహ్లి సగం పిచ్ దాటి దూసుకొచ్చేశాడు. వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసినా అప్పటికే డుమిని డైరెక్ట్ త్రో నాన్ స్ట్రైకింగ్ వికెట్లకు తాకింది. మరి కొద్ది సేపటికే రహానే (8) కూడా దాదాపు ఇదే తరహాలో అవుటయ్యాడు. తగ్గిన జోరు... రోహిత్ 92 పరుగుల వద్ద ఉన్నప్పుడు కీపర్ క్యాచ్ కోసం దక్షిణాఫ్రికా రివ్యూ చేయగా బంతి బ్యాట్‌కు తగల్లేదని తేలింది. తర్వాతి ఓవర్లో ఫోర్‌తో 96కు చేరుకున్న రోహిత్‌కు మళ్లీ అదృష్టం కలిసొచ్చింది. రబడ బౌలింగ్‌లో రోహిత్ అప్పర్కట్ ఆడగా బౌండరీ వద్ద నేరుగా చేతుల్లోకి వచ్చిన సునాయాస క్యాచ్‌ను షమ్సీ వదిలేశాడు. అనంతరం షమ్సీ బౌలింగ్‌లోనే బ్యాక్వర్డ్ స్క్వేర్‌లెగ్ దిశగా రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ సాంత్వన పొందాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ (37 బంతుల్లో 30; 2 ఫోర్లు) చక్కటి సహకారం అందించడంతో నాలుగో వికెట్‌కు 60 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదైంది. 40 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 219 పరుగులకు చేరింది. అయితే ఆపై వేగంగా పరుగులు తీయడంలో జట్టు విఫలమైంది. ముఖ్యంగా 42–45 మధ్య నాలుగు ఓవర్లలో 10 పరుగులు మాత్రమే చేసిన భారత్ 3 వికెట్లు కోల్పోయింది. ఆఖరి పది ఓవర్లలో భారత్ 55 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆమ్లా మినహా... లక్ష్య ఛేదనలో ఓపెనర్లు ఆమ్లా, మార్క్రమ్ (32 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) 52 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే 13 పరుగుల వ్యవధిలో మార్క్రమ్తో పాటు డుమిని (1), డివిలియర్స్ (6) వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఈ దశలో ఆమ్లా, మిల్లర్ (51 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 62 పరుగులు జత చేసి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే భారత బౌలర్లు కట్టడి చేయడంతో పరుగులు రావడం తగ్గిపోయి సఫారీలపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ఐదో వికెట్ రూపంలో ఆమ్లా రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో దక్షిణాఫ్రికా మ్యాచ్‌పై ఆశలు కోల్పోయింది. ఇన్నింగ్స్ 42వ ఓవర్లో కుల్దీప్ మూడు వికెట్లు తీసి భారత్‌ను గెలుపునకు చేరువ చేయగా... మరో మూడు బంతులకే దక్షిణాఫ్రికా ఆలౌటైంది. ► ద్వైపాక్షిక సిరీస్‌లో భారత తరఫున ఇద్దరు స్పిన్నర్లు 30 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన ఐదు వన్డేల్లో కుల్దీప్కు 16 వికెట్లు, చహల్‌కు 14 వికెట్లు లభించాయి. 2006లో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన ఆరు వన్డేల సిరీస్‌లో భారత స్పిన్నర్లు అత్యధికంగా 27 వికెట్లు తీశారు. ►దక్షిణాఫ్రికాపై ఓ సిరీస్‌లో భారత్ తరఫున 300 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లి, ధావన్ గుర్తింపు పొందారు. గతంలో గంగూలీ అత్యధికంగా 285 పరుగులు చేశాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ధావన్ (సి) ఫెలుక్వాయో (బి) రబడ 34; రోహిత్ (సి) క్లాసెన్ (బి) ఇన్‌గిడి 115; కోహ్లి (రనౌట్) 36; రహానే (రనౌట్) 8; అయ్యర్ (సి) క్లాసెన్ (బి) ఇన్‌గిడి 30; పాండ్యా (సి) క్లాసెన్ (బి) ఇన్‌గిడి 0; ధోని (సి) మార్క్రమ్ (బి) ఇన్‌గిడి 13; భువనేశ్వర్ (నాటౌట్) 19; కుల్దీప్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 274. వికెట్ల పతనం: 1–48; 2–153; 3–176; 4–236; 5–236; 6–238, 7–265. బౌలింగ్: మోర్కెల్ 10–2– 44–0; రబడ 9–0–58–1; ఇన్‌గిడి 9–1–51–4; ఫెలుక్వాయో 8–0–34–0; డుమిని 4–0–29–0; షమ్సీ 10–0–48–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (రనౌట్) 71; మార్క్రమ్ (సి) కోహ్లి (బి) బుమ్రా 32; డుమిని (సి) రోహిత్ (బి) పాండ్యా 1; డివిలియర్స్ (సి) ధోని (బి) పాండ్యా 6; మిల్లర్ (బి) చహల్ 36; క్లాసెన్ (స్టంప్డ్) ధోని (బి) కుల్దీప్ 39; ఫెలుక్వాయో (బి) కుల్దీప్ 0; రబడ (సి) చహల్ (బి) కుల్దీప్ 3; మోర్కెల్ (ఎల్బీ) (బి) చహల్ 1; షమ్సీ (సి) పాండ్యా (బి) కుల్దీప్ 0; ఇన్‌గిడి (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (42.2 ఓవర్లలో ఆలౌట్) 201. వికెట్ల పతనం: 1–52; 2–55; 3–65; 4–127; 5–166; 6–168; 7–196; 8–197; 9–197; 10–201. బౌలింగ్: భువనేశ్వర్ 7–0–43–0; బుమ్రా 7–0–22–1; పాండ్యా 9–0–30–2; కుల్దీప్ 10–0–57–4; చహల్ 9.2–0–43–2. -
విరిసిన గులాబీ.. సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ
‘పింక్’ పోరులో భారత జోరు తేలిపోయింది. గులాబీ ముల్లు గుచ్చేసింది. దక్షిణాఫ్రికా తనదైన శైలిలో గెలిచింది. నాలుగో వన్డేలో ధావన్ సెంచరీ చేసినా... కోహ్లి కసిదీరా ఆడినా... గులాబీ జెర్సీలో మమ్మల్ని ఓడించలేరని సఫారీ తేలిగ్గా తేల్చేసింది. మొత్తానికి భారత జైత్రయాత్రను వాండరర్స్‌లో మొదట వర్షం అడ్డుకుంటే... తర్వాత ప్రత్యర్థి జట్టు ఓడించేదాకా ఆడుకుంది. జొహన్నెస్‌బర్గ్: భారత్ భారీ స్కోరు నిలవలేదు. పేస్ పదును సరిపోలేదు. స్పిన్ పాచిక పారలేదు. కొత్త చరిత్ర సృష్టించేందుకు వాన, వాండరర్స్ మైదానం రెండూ సహకరించలేదు. నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా ‘పింక్’స్థైర్యమే గెలిచింది. టీమిండియా ‘హ్యాట్రిక్’ విజయాలకు బ్రేకులేసింది. శనివారం ఆగి... ఆగి... సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (105 బంతుల్లో 109; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించగా, కోహ్లి (83 బంతుల్లో 75; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. రబడ, ఇన్‌గిడి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత వర్షం కారణంగా దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 28 ఓవర్లలో 202 పరుగులుగా నిర్ణయించగా... ఆ జట్టు 25.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసి గెలిచింది. సిరీస్‌లో ఐదో వన్డే మంగళవారం పోర్ట్ ఎలిజబెత్‌లో జరుగుతుంది. ఆరు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 3–1తో ఆధిక్యంలో ఉంది. మిల్లర్, క్లాసెన్ వీరబాదుడు : ఓపెనర్లు మార్క్రమ్ (22), ఆమ్లా(33), ఫస్ట్‌డౌన్ డుమిని(10) తక్కువ పరుగులకే ఔటయ్యారు. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన విధ్వంసకారుడు ఏబీ డివిల్లీర్స్.. అందరూ ఊహించినట్లే చెలరేగి ఆడే ప్రయత్నం చేశాడు. కానీ 26 పరుగులకే(18 బంతుల్లో) పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన మిల్లర్, క్లాసెన్‌లు ఆకాశమే హద్దుగా విజృంభించారు. చాహల్ బౌలింగ్‌లో లైఫ్‌లు పొందిన మిల్లర్ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సఫారీకి గెలుపుబాట వేశాడు. జట్టుస్కోరు 174 ఉన్నప్పుడు మిల్లర్..5వ వికెట్‌గా ఔటయ్యాడు. అటుపై ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ క్లాసెన్ (27 బంతుల్లో 43 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కడదాకా నిలిచి జట్టును గెలిపించాడు. ఫెలుక్వాయో (5 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. భారత ఫీల్డింగ్ వైఫల్యాలు, కీలకమైన క్యాచ్‌ల నేలపాలు సఫారీకి కలిసొచ్చాయి. భారత బౌలర్లలో కుల్దీప్ 2 వికెట్లు పగడొట్టాడు. చాహల్, బూమ్రా, పాండ్యాలకు తలో వికెట్ దక్కింది. ధావన్ ధనాధన్ : శనివారం జరిగిన నాలుగో వన్డేలో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (105 బంతుల్లో 109; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించగా, కోహ్లి (83 బంతుల్లో 75; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. టాస్ నెగ్గిన భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగగా... రోహిత్ శర్మ (5) మరోసారి విఫలమయ్యాడు. రబడ బౌలింగ్‌లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో భారత్ 20 పరుగులకే మొదటి వికెట్‌ను కోల్పోయింది. ఇక మరో వికెట్ కోసం దక్షిణాఫ్రికా చెమటోడ్చింది. క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ కోహ్లి, ధావన్‌తో కలిసి స్కోరు బోర్డును ధాటిగా పరిగెత్తించాడు. దీంతో జట్టు స్కోరు 19వ ఓవర్లో వంద పరుగులు చేరింది. తర్వాత కూడా ఓవర్‌కు సగటున 6 రన్‌రేట్‌తో దూసుకెళ్లింది. ఈ జోడీని విడగొట్టేందుకు సఫారీ బౌలర్ల ప్రయత్నాలేవీ ఫలించలేదు. మొదట ధావన్ ఆ తర్వాత కోహ్లి (56 బంతుల్లో; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. భారత్ స్కోరు 25 ఓవర్లలో 150కి చేరింది. ఎట్టకేలకు జట్టు స్కోరు 178 పరుగుల వద్ద మోరిస్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి నిష్క్రమించడంతో 158 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కోహ్లి ఔటయ్యే సమయానికి స్కోరు 31.1 ఓవర్లలో 178/2. చేతిలో మరో 8 వికెట్లుండటంతో 340 పరుగుల భారీ స్కోరు ఖాయమనుకుంటే కనీసం మూడొందలైనా చేయలేకపోయింది. రహానే, శ్రేయస్ అయ్యర్, పాండ్యా అంతా మూకుమ్మడిగా విఫలమయ్యారు. వరుస ఓవర్లలో ధావన్, రహానే (8) నిష్క్రమించడం భారత్‌ను దెబ్బ తీసింది. దీంతో శ్రేయస్ (18), ధోని (42 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆచితూచి ఆడటంతో స్కోరు వేగం పూర్తిగా మందగించింది. చివర్లో భారీషాట్ల కోసం ప్రయత్నించినప్పటికీ దక్షిణాఫ్రికా బౌలర్ల చేతికి చిక్కారు. పాండ్యా (9) కొట్టిన షాట్‌ను మార్క్రమ్ లిప్తపాటు కాలంలోనే గాల్లో అందుకున్న తీరు అద్భుతం. ‘పింక్’ వాండరర్స్ రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పింక్ జెర్సీలతో మైదానంలోకి దిగారు. దీనికి మద్దతుగా ప్రేక్షకులు సైతం గులాబీ రంగు టీషర్టులు, టోపీలు, కళ్ల జోడులతో స్టేడియాన్ని పింక్ మయం చేశారు. ఆశ్చర్యకరంగా స్టేడియంలోని ప్రకటనలు కూడా గులాబీ వర్ణంలోనే దర్శనమిచ్చాయి. నేటి మ్యాచ్‌తో కలిపి మొత్తం 6 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా పింక్ జెర్సీలతో ఆడగా.. అన్నింటా విజయం సాధించింది. -
సౌతాఫ్రికా టార్గెట్ 202 (28 ఓవర్లలో)
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా-భారత్‌ల మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు గంటపాటు మ్యాచ్‌ను నిలిపేసిన అంపైర్లు.. రెండో ఇన్నింగ్స్ లక్ష్యాన్ని కుదించారు. సవరించిన లక్ష్యం ప్రకారం సౌతాఫ్రికా గెలుపుకోసం 28 ఓవర్లలో 202 పరుగులు చేయాల్సిఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 289 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్(109; 105 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి(75), ఎంఎస్ ధోని( 42 నాటౌట్)లు రాణించడంతో భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. దాంతో భారత ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌లు ఆరంభించారు. అయితే ఇన్నింగ్స్ నాల్గో ఓవర్లో రోహిత్(5) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో ధావన్‌కు కోహ్లి జత కలిశాడు. వీరిద్దరూ సమయోచితంగా ఆడి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడి రెండో వికెట్‌కు 158 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత కోహ్లి రెండో వికెట్‌గా అవుటయ్యాడు. ఆపై ధావన్ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికి పెవిలియన్‌కు చేరడంతో భారత స్కోరులో వేగం తగ్గింది. అజింక్యా రహానే(8), శ్రేయస్ అయ్యర్(18), హార్దిక్ పాండ్యా(9)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. కాగా, ధోని చివర వరకూ క్రీజ్‌లో నిలబడటంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా, ఎన్గిడిలు తలో రెండు వికెట్లు సాధించగా, మోర్నీ మోర్కెల్, క్రిస్ మోరిస్‌లకు చెరో వికెట్ లభించింది. -
చాహల్-కుల్దీప్.. మళ్లీ తిప్పేశారు
భారత జట్టు మళ్లీ అదరగొట్టింది... మూడో టెస్టు నుంచి మొదలైన జోరు ఇప్పుడు మూడో వన్డే వరకు సాగింది... మరో ఏకపక్ష పోరులో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా సిరీస్‌లో మన ఆధిక్యాన్ని మరింత బలంగా ప్రదర్శించింది. ముందుగా కోహ్లి వీరశతకం, ధావన్ దూకుడుతో చెలరేగిన భారత్... ఆ తర్వాత మళ్లీ తన స్పిన్ ఉచ్చులో దక్షిణాఫ్రికాను పడేసింది. ఇక తర్వాతి అంకం తొలిసారి సిరీస్ గెలుచుకొని సగర్వంగా నిలబడటమే. కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా గడ్డపై గత నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌లలో కూడా ఓటమి పాలైన భారత్ ఇప్పుడు ఆ గండాన్ని మాత్రం దిగ్విజయంగా దాటేసింది. హ్యాట్రిక్ విజయంతో ఇక వన్డే సిరీస్ కోల్పోయే అవకాశం లేని స్థితిలో నిలిచింది. బుధవారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో భారత్ 124 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (159 బంతుల్లో 160 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో చెలరేగగా... శిఖర్ ధావన్ (63 బంతుల్లో 76; 12 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం దక్షిణాఫ్రికా కుల్దీప్ (4/23), చహల్ (4/46) మాయాజాలానికి 40 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. జేపీ డుమిని (67 బంతుల్లో 51; 4 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. తాజా ఫలితంతో ఆరు వన్డేల సిరీస్‌లో భారత్ 3–0తో పటిష్ట స్థితిలో నిలిచింది. నాలుగో వన్డే శనివారం జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతుంది. భారీ భాగస్వామ్యం... దక్షిణాఫ్రికా గడ్డపై రోహిత్ శర్మ వైఫల్యం ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. రబడ వేసిన తొలి ఓవర్లోనే రోహిత్ (0) కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో సున్నా వద్దే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లి సున్నా పరుగుల వద్ద ఉన్నప్పుడు అంపైర్ ఎల్బీగా ప్రకటించినా... రివ్యూలో బంతి బ్యాట్‌ను తాకిందని తేలడంతో అతను బతికిపోయాడు. ఆ తర్వాత ధావన్, కోహ్లి ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు. బలహీనంగా కనిపించిన సఫారీ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు దూసుకుపోయారు. ఎక్కడా తడబాటు లేకుండా వీరిద్దరు స్వేచ్ఛగా ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించారు. ముఖ్యంగా తొలి వన్డే ఆడుతున్న ఇన్‌గిడి 4 ఓవర్ల మొదటి స్పెల్‌లో భారత్ 6 ఫోర్లతో 29 పరుగులు రాబట్టింది. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 10 ఫోర్లతో 50 పరుగులు చేసింది. ఈ జోరులో ధావన్ 42 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం 100 పరుగులు దాటిన తర్వాత 64 బంతుల్లో కోహ్లి కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే డుమిని బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయి ధావన్ వెనుదిరగడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. అనవసరపు షాట్‌కు ప్రయత్నించి రహానే (11) అవుట్ కాగా, పాండ్యా (14) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో దక్షిణాఫ్రికా కొంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. ఫలితంగా పరుగుల వేగం మందగించింది. ధోని (22 బంతుల్లో 10) పూర్తిగా నిరాశపర్చగా... జాదవ్ (1) తనకు లభించిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. అయితే భువనేశ్వర్ (16 నాటౌట్) అండగా నిలవడంతో కోహ్లి మళ్లీ జట్టు ఇన్నింగ్స్‌ను సరైన దారిలో పెట్టాడు. కోహ్లి, భువీ ఏడో వికెట్‌కు అభేద్యంగా 67 పరుగులు జోడించడం విశేషం. చివరి ఐదు ఓవర్లలో 47 పరుగులు రాబట్టిన భారత్ 300 పరుగుల స్కోరును దాటింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) డుమిని మినహా... పేసర్ బుమ్రా తాను వేసిన తొలి బంతికే ఆమ్లా (1)ను అవుట్ చేసి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశాడు. ఈ దశలో కెప్టెన్ మార్క్రమ్ (42 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), డుమిని కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. అయితే కుల్దీప్ తొలి ఓవర్లో ముందుకు వచ్చి ఆడటానికి ప్రయత్నించిన మార్క్రమ్ను ధోని స్టంపౌట్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత చక్కటి బంతితో క్లాసెన్ (6)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న చహల్, తన తర్వాతి ఓవర్లో డుమినిని కూడా పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత మిల్లర్ (25) పోరాడే ప్రయత్నం చేసినా అది సరిపోలేదు. వరుస ఓవర్లలో మోరిస్ (14), జోండో (17) అవుట్ కాగా... ఫెలుక్వాయో (3)ను కుల్దీప్ దెబ్బ తీయడంతో దక్షిణాఫ్రికా విజయంపై ఆశలు కోల్పోయింది. ►4 వన్డేల్లో 400 మందిని అవుట్ చేయడంలో భాగ మైన నాలుగో వికెట్ కీపర్ ధోని. సంగక్కర (482), గిల్‌క్రిస్ట్ (472), బౌచర్ (424) ముందున్నారు. ► 8 వన్డేల్లో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న ఎనిమిదో భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలిచాడు. ధోని (216) తొలి స్థానంలో ఉన్నాడు. ► 1 టెస్టుల్లో (14), వన్డేల్లో (12) అత్యధిక సెంచరీలు కొట్టిన భారత కెప్టెన్‌గా కోహ్లి రికార్డు. ► 1 ఒకే వన్డేలో భారత్ తరపున ఇద్దరు స్పిన్నర్లు నాలుగు వికెట్ల చొప్పున తీయడం ఇదే ప్రథమం. ►1 కెరీర్లో 34వ సెంచరీ చేసిన క్రమంలో దక్షిణాఫ్రికాలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాట్స్‌మన్ గా కోహ్లి రికార్డులకెక్కాడు. సచిన్ (152) స్కోరును అతను దాటేశాడు. -
ఇంకా ఒక్కటి బాదితే రికార్డు బద్దలే!
డర్బన్ : ఎవడు కొడితే రెండోఇన్నింగ్స్‌లో టీమిండియా విక్టరీ సాధింస్తుందో.. ఆ ‘చేజింగ్ మాస్టర్’ కోహ్లి మరో ఘనత సాధించాడు. విదేశీ గడ్డపై అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ రికార్డును సమం చేశాడు. సారథులుగా కోహ్లి, గంగూలీలు ఇద్దరూ విదేశాల్లో 11 సెంచరీలు చేశారు. ఇందుకుగానూ గంగూలీకి 142 ఇన్నింగ్స్‌లు పడితే, కోహ్లి కేవలం 41 ఇన్నింగ్స్‌ల్లోనే పూర్తిచేశాడు. కోహ్లి ఇకా ఒకే ఒక్క సెంచరీ బాదితే.. గంగూలీ రికార్డు బద్దలయినట్లే! సౌతాఫ్రికా గడ్డపై తొలి సెంచరీ మోదిన కోహ్లి.. ఆ జట్టుతో మరో ఐదు వన్డేలు ఆడాల్సిఉంది. కాబట్టి ఈ సిరీస్‌లోనే విరాట్ పనికాచ్చేస్తాడని ఆశిద్దాం. చేజింగ్ మాస్టర్ : డర్బన్ టన్నుతో కలిపి వన్డేల్లో కోహ్లి సెంచరీల సంఖ్య 33కు చేరింది. ఇందులో 20 సెంచరీలు లక్ష్యఛేదనలో సాధించినవే కావడం గమనార్హం. ఆ 20 సెంచరీల్లోనూ 18 సెంచరీలు జట్టును విజయతీరాలకు చేర్చినవే కావడం విశేషం. కెరీర్లో మొత్తంలో విదేశీ గడ్డపై కోహ్లి 15 సెంచరీలు చేశాడు. అందులో కెప్టెన్‌గా సాధించినవే 11 సెంచరీలు! డర్బన్ వేదికగా గురువారం సౌతాఫ్రికా-ఇండియాల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 270 పరుగుల లక్ష్యాన్ని భారత్ 45.3 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ కోహ్లి 112(119 బంతుల్లో), రహానే 79 (86 బందుల్లో) పరుగులతో జట్టును గెలిపించారు. ఈ విజయంతో ఆరు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజలో నిలిచింది. -
పాక్ ను చూసి నేర్చుకోండి!
అబుదాబి: వెస్టిండీస్ సీనియర్ ప్లేయర్ డ్వేన్ బ్రేవో వ్యాఖ్యలు దేశ క్రికెట్ బోర్డు(డబ్ల్యూఐసీ)ను తీవ్రనిరాశపరిచాయని, అయితే ఓ ఒక్కరు షాక్ కు గురికాలేదని టీమ్ మేనేజర్ జోయెల్ గార్నర్ అన్నాడు. కోచ్ గా సేవలందించి విజయవంతమైన ఫిల్ సిమ్మన్స్ ను అర్ధాంతరంగా తొలగించడాన్ని విండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో తీవ్రంగా విమర్శించగా.. జట్టులోని ఆటగాళ్లపై ఈ ప్రభావం పడుతుందని గార్నర్ ఆందోళన వ్యక్తంచేశాడు. అందులోనూ ప్రస్తుతం పాకిస్తాన్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో మరో మ్యాచ్ ఉండగానే 2-0తో ఓటమిపాలు కాగా, టీ20 సిరీస్ లోవైట్ వాట్ అయిన విషయాన్ని గుర్తుచేశాడు. బుధవారం మూడో వన్డే జరగనున్న తరుణంలో ఆటగాళ్లను తప్పుదోవ పట్టిస్తున్నాడని బ్రేవోపై ఆరోపణలు చేశాడు. ఆటగాళ్లను మళ్లీ స్కూలు పిల్లల మాదిరిగా ట్రీట్ చేస్తున్నారని బ్రేవో మండిపడ్డ విషయం తెలిసిందే. సిరీస్ కు ఎలా సన్నధ్దమవ్వాలో, ఆటలో మంచి ప్రదర్శన ఎలా చేయాలో పాక్ జట్టును చూసి నేర్చుకోవాలని గార్నర్ విండీస్ ఆటగాళ్లకు సూచించాడు. ఆటగాళ్లు పాకిస్తాన్ తో సిరీస్ లకు పూర్తిగా సన్నద్ధమయ్యారని అయితే పరిస్థితులకు అనుగుణంగా రాణించలేక వైఫల్యం చెందారని గార్నర్ అభిప్రాయపడ్డాడు. సెప్టెంబర్ 10, 11 తేదీలలో బార్బడోస్ లో ఆటగాళ్లకు ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించామని, ఆ తర్వాతే పాక్ తో ఆడే జట్టును ప్రకటించినట్లు చెప్పారు. ఎన్నో విషయాలపై నోరు విప్పిన మేనేజర్ మాత్రం.. దుబాయ్ కి బయలుదేరే సమయంలో ఏ క్రికెట్ బోర్డ్ అయినా ప్రధాన కోచ్ ను తప్పిస్తుందా అన్న బ్రేవో కామెంట్ పై మాత్రం స్పందించేందుకు నిరాకరించడం గమనార్హం. -
'టమాటో చెట్టుకు ఉరి వేసుకోవాలనుకున్నా'
హరారే: చాలాసార్లు ఓటమి మనుషిని కుంగదీస్తుంది. కొన్నిసార్లైతే చనిపోవాలని కూడా అనిపిస్తుంది. ఒత్తిడితో కూడుకున్న క్రికెట్ లాంటి ఆటల్లోనైతే టెన్షన్ భరించడం చాలా కష్టం. భారీ ఆశలు పెట్టుకున్న తన జట్టు పేక మేడలా కూలిపోతుంటే, ప్రత్యర్థి చేతిలో చావుదెబ్బలు తింటోంటే.. ఏ శిక్షకుడికైనా రోషం పొడుచుకొస్తుంది. ఆ కోపం అదుపుతప్పినప్పుడు ఆత్మహత్యచేసు కోవాలని కూడా పిస్తుంది.. జింబాబ్వే కోచ్ ముకాయా ఎన్తిని లాగా. భారత్ పై జింబాబ్వే వరుస ఓటములు జీర్ణించుకోలేకపోతున్నానన్న ఎన్తిని.. 'ఈ ఓటమి చూశాక నాకు బతకాలని లేదు. టమాటా చెట్టుకు ఉరి వేసుకుని చచ్చిపోదామనుకున్నా. స్టేడియం బయట టమాటో చెట్లు ఉండిఉంటే.. ఈ పాటికి మీరు ఎన్తిని మరణవార్తలు రాసేవారు' అంటూ ఒక్కతీరుగా ఆగ్రహావేశానికి లోనయ్యాడు. దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ గా ప్రపంచంలోని ఇతర బ్యాట్స్ మన్లను గడగడలాడించిన ఎన్తిని.. ఇంతలా కుంగిపోవడానికి బలమైన కారణంఉంది. (చదవండి: క్లీన్ స్వీప్ లాంఛనమ!) జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత్ మూడు వన్ డేల సిరీస్ ను మరో మ్యాచ్ ఉందనగానే 2-0తో కైవసం చేసుకుంది. రెండో మ్యాచ్ లో జింబాబ్వే కనీస పోరాటం చేయకుండా చేతులెత్తేయడాన్ని ఆ దేశాభిమాను జీర్ణించుకోలేకపోయారు. 'ఈ ఘోరఅవమానాన్ని మేం చూడలేం' అంటూ స్టేడియంలోనే పెద్ద పెట్టున నినాదాలు చేసి, ఫ్లకార్డులు చూపారు. ఓట్ ఫీల్డ్ లో కూర్చుని మ్యాచ్ చూస్తోన్న ఎన్తినిని ఆ అభిమానుల చర్యలు బాధపెట్టాయట. అందుకే టొమాటో చెట్టుకు ఉరివేసుకుందామనుకున్నాడట! వాట్ మోర్ రాజీనామా తర్వాత ఎన్తిని జింబాబ్వే తాత్కాలిక కోచ్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. -
బంగ్లా దెబ్బకు సఫారీలు కుదేలు
చిట్టగాంగ్: బంగ్లాదేశ్ దెబ్బకు సఫారీలు కుదేలు అయ్యారు. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం ఇక్కడ జరిగిన మూడో వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టుపై బంగ్లాదేశ్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 83 బంతులు మిగిలి ఉండగానే బంగ్లా మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. సఫారీలు నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 26.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 170 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్ ఆటగాడు సౌమ్య సర్కార్ 75 బంతుల్లో (13 ఫోర్లు, 1 సిక్స్) 90 పరుగులు చేశాడు. అనంతరం ఇమ్రాన్ తహీర్ బౌలింగ్‌లో ఆమ్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలీయన్ చేరాడు. లితన్ దాస్ 5, తమీమ్ ఇక్బాల్ 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కాగా, సఫారీ బౌలర్ ఇమ్రాన్ తహీర్ ఒక వికెట్ తీసుకున్నాడు. అంతకముందు బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత 40 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేశారు. సఫారీ ఆటగాడు డుమినీ 51 పరుగులు, డేవిడ్ మిల్లర్ 44 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లు కాక్ 7, ఆమ్లా 15, ప్లెసెస్ 6, బెహారడియన్ 12 పరుగులు చేశారు. రాబ్దా, అబట్టా మెర్కేల్ సింగల్ డిజెట్కే పరిమితమైయ్యారు. బంగ్లా ఆటగాళ్లు రహమాన్, రుబెల్ హుస్సేన్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, షకీబ్ మూడు వికెట్లను తన ఖాతలో వేసుకున్నాడు. మెర్తాజా, మహ్మదుల్లా తలో వికెట్ తీసుకున్నారు. -
భారత్-శ్రీలంక వన్డే సిరీస్ షెడ్యూలు
న్యూఢిల్లీ : భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే వన్డే సిరీస్ షెడ్యూలు శనివారం విడుదలయ్యింది. వచ్చే నెలల 2వ తేదీ నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు మహేంద్ర సింగ్ ధోనీకి విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ.. కోహ్లీని కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. దీంతో పాటు వన్డేల వేదికలను కూడా ఖరారు చేసింది. కటక్, అహ్మదాబాద్, హైదరాబాద్, కోల్‌కతా, రాంచీలలో ఈ వన్డేలు జరుగనున్నాయి. షెడ్యూలు వివరాలు : నవంబర్ 2న మొదటి వన్డే- కటక్ నవంబర్ 5న రెండో వన్డే - అహ్మదాబాద్ నవంబర్ 9న మూడో వన్డే - హైదరాబాద్ నవంబర్ 13న నాల్గో వన్డే - కోల్‌కతా నవంబర్ 16న ఐదో వన్డే - రాంచీ -
‘శాస్త్రి’ వేసిన మంత్రమేంటి!
►భారత జట్టులో ఒక్కసారిగా మార్పు ►ఆటగాళ్లలో తిరుగులేని ఆత్మవిశ్వాసం ►వన్డేల్లో అద్భుత ప్రదర్శన ►టీమ్ డెరైక్టర్ నివేదిక ప్రభావమేనా! నాటింగ్‌హామ్‌లో రెండో వన్డే... ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో అండర్సన్ గార్డ్ తీసుకుంటుండగా మైదానంలో ఒక్కసారిగా ప్రేక్షకుల అరుపులు, హేళన... ఆ తర్వాత భారత్ జట్టు విజయం పూర్తయ్యాక నాటౌట్ బ్యాట్స్‌మన్ జడేజా పాటతో శృతి కలుపుతూ అభిమానుల ఆనందోత్సాహం... కొద్ది రోజుల క్రితం ఇదే మైదానంలో ఉన్న పరిస్థితికి, నేటికి ఒక్కసారిగా ఎంత మార్పు. టెస్టుల్లో ఘోర పరాజయం, అండర్సన్‌తో వివాదం వంటి పరిణామాలతో ధోని సేన ఎలా కనిపించింది? అదే ఇప్పుడు ఒకవైపు ఇంగ్లండ్ జట్టు ఓటమి భారంతో కుంగిపోయి నిర్వేదంగా ఉంటే మరోవైపు భారత ఆటగాళ్లలో మాత్రం అంతులేని ఆత్మవిశ్వాసం. టెస్టుల్లో ఓడిన జట్టు ఇదేనా అనిపించే విధంగా... వన్డేల్లో టీమిండియా విజయాలు సాధిస్తోంది. ఒక్కసారిగా ఈ మార్పుకు కారణమేంటి... ఆటగాళ్ల ప్రదర్శనపై ‘డెరైక్టర్’ ప్రభావమేంటి? సాక్షి క్రీడా విభాగం: టెస్టు సిరీస్‌తో పోలిస్తే భారత వన్డే జట్టులో ప్రధానంగా మూడు మార్పులు జరిగాయి. రైనా, అంబటి రాయుడు, మోహిత్ శర్మ జట్టులోకి వచ్చారు. మిగతా ఆటగాళ్లంతా వైఫల్యంలో భాగమైనవారే. కానీ వన్డేలకు వచ్చేసరికి ఇదే జట్టు తిరుగులేనిదిగా కనిపిస్తోంది. ముఖ్యంగా జడేజా, అశ్విన్‌లాంటి ఆటగాళ్లు తమ విలువేంటో చూపించారు. రహానే కూడా విరామం తర్వాత ఓపెనింగ్‌కు వచ్చినా ఎలాంటి తడబాటుకు లోను కాకుండా ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించాడు. నాలుగు, ఐదు టెస్టుల్లో రహానే అవుటైన తీరుతో పోలిస్తే అతను తన బాధ్యతను గుర్తించినట్లు కనిపించింది. వన్డేల్లో తిరుగులేని ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న కోహ్లి కూడా రెండో వన్డేతో మళ్లీ ఆత్మవిశ్వాసం అందుకునే పనిలో పడ్డాడు. సహచరులతో స్ఫూర్తి పొందాడేమో... ఎంతో సంయమనంతో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. రెండు మ్యాచుల్లోనూ జట్టులో సమష్టితత్వం కనిపించింది. ఏ ఒక్క ఆటగాడిపైనో ఆధారపడకుండా ప్రతీ ఒక్కరు తమ వంతు పాత్ర పోషించారు. కీలక భాగస్వామ్యాలతో బ్యాట్స్‌మెన్ ఇన్నింగ్స్‌ను నిర్మిస్తే... బౌలర్లూ ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. ఇక వన్డేల్లో ధోని కెప్టెన్‌గా తన మార్క్‌ను మరోసారి చూపించాడు. ఇంగ్లండ్ బలహీనతపై దెబ్బ కొడుతూ సరైన సమయంలో స్పిన్నర్లను ఉపయోగించుకున్న తీరు అతనేమిటో చూపించింది. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ప్రధాన బౌలర్ మోహిత్ గాయపడినా ఆ ప్రభావమే కనపడనీయలేదు. చాన్స్ దక్కగానే... వన్డేల్లో రైనాకు ఎప్పటినుంచో గుర్తింపు ఉంది. కానీ గత మ్యాచ్‌లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం తెలుగు తేజం రాయుడు ప్రదర్శన గురించే. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే ఇంగ్లండ్ గడ్డపై అండర్-19 ఆటగాడిగా అంబటి రాయుడు 114 బంతుల్లోనే 177 పరుగులు చేసి తొలిసారి వెలుగులోకి వచ్చాడు. అదే మ్యాచ్‌లో రైనా 3 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు! కానీ పుష్కర కాలం తర్వాత కూడా రాయుడు భారత ప్రధాన జట్టులో చోటు దక్కించుకునేందుకు ఇంకా శ్రమిస్తున్నాడు. రెండో వన్డేకు ముందు 13 మ్యాచ్‌లు ఆడినా... ఇలాంటి కీలక ఇన్నింగ్స్ ఆడే అవకాశం అతనికి దక్కలేదు. కానీ ఇప్పుడు మిడిలార్డర్లో స్థానానికి తానూ రేస్‌లో ఉన్నానని ఈ మ్యాచ్‌తో అతను నిరూపించుకోవడం మంచి పరిణామం. ఇదే జట్టు కొనసాగుతుందా... ‘ఓవరాల్‌గా ఇది చాలా మంచి జట్టుగా కనిపిస్తోంది. ఒకసారి మన బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే అద్భుతంగా ఉంది. రోహిత్ కూడా ఫిట్‌గా ఉంటే ఇక తిరుగు లేదు. పరిస్థితులను బట్టి ఆటగాళ్ల ప్రదర్శనను బేరీజు వేయాలి. అలా చూస్తే అందరూ బాగా ఆడుతున్నారు’... రెండో వన్డే విజయం అనంతరం భారత కెప్టెన్ ధోని వ్యాఖ్య ఇది. వరుస ఓటముల తర్వాత వన్డేల్లో విజయాలతో సహచరులు తనలో ఆత్మవిశ్వాసం పెంచారన్నట్లు ధోని మాటల్లో వినిపించింది. ఇక మన జట్టు ఫీల్డింగ్ కూడా అత్యుత్తమ స్థాయిలో ఉంది. దీనిని కూడా ధోని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇప్పుడు ఉన్న ఆటగాళ్లలో ఒక్క ధావన్ మినహా అంతా గాడిలో పడటం చెప్పుకోదగ్గ పరిణామం. అయితే ఒక్క మంచి ఇన్నింగ్స్ అతడిని నిలబెడుతుందని కెప్టెన్ భావిస్తున్నాడు. అదే జరిగితే అది జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. నయానో... భయానో... టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి బస్సులో తనలో స్ఫూర్తి నింపడమే కారణమని రైనా చెబుతున్నాడు. మరోవైపు వన్డే సిరీస్‌కు ముందు డెరైక్టర్‌ను లెక్క చేయని కెప్టెన్, ఇప్పుడు మౌనం వహిస్తున్నాడు. ఇంతకీ రవిశాస్త్రి చేసిందేమిటి... ఆయన చేతిలోకి ఏ మంత్రదండం వచ్చేసింది? జట్టు, ఆటగాళ్ల ప్రదర్శనను విశ్లేషించడం, వారితో మాట్లాడటమే కాదు... మరో ప్రత్యేక పనిని కూడా శాస్త్రికి బోర్డు అప్పగించింది. ఆటగాళ్ల ప్రవర్తన, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం, ఫ్లెచర్ పని తీరు, ధోని కెప్టెన్సీ... ఇలా ప్రతీ అంశంపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను శాస్త్రి బీసీసీఐకి ఇవ్వనున్నారు. ‘సరిగ్గా చెప్పాలంటే ఈ నివేదికపైనే కొందరు యువ ఆటగాళ్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ముఖ్యంగా ఆటగాళ్లపై ఎలాంటి వ్యక్తిగత అభిమానంలాంటివి లేకుండా పూర్తి పారదర్శకంగా దీనిని ఇవ్వాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ నివేదిక అంశం ఆటగాళ్లను ఒక్కసారిగా ఉత్తేజితుల్ని చేసినట్లుంది. ఆడకపోతే ఇంతే సంగతులు అనే సందేశం కూడా వారికి వెళ్లింది. దాంతో టెస్టు వైఫల్యం అనంతరం అందరికీ తమ బాధ్యత గుర్తొచ్చింది. ఇకపై శాస్త్రి ‘మార్గదర్శనం’ ఇదే తరహాలో ఉంటే భారత జట్టు వరుస విజయాల జోరు సాగించడం ఖాయంగా కనిపిస్తోంది. -
వర్షంతో తొలి వన్డే రద్దు
- రెండో వన్డే బుధవారం - ఆ మ్యాచ్‌కూ వరుణుడి గండం బ్రిస్టల్: భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం జరగాల్సిన తొలి వన్డే రద్దయింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఉదయం కొద్దిసేపు ఆగినా మళ్లీ మొదలై మధ్యాహ్నం వరకు ఆగలేదు. దీంతో మ్యాచ్ రద్దయినట్లు ప్రకటించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం కార్డిఫ్‌లో జరుగుతుంది. అయితే బుధవారం ఆ నగరంలోనూ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. -
ఆసీస్ చేతిలో జింబాబ్వే చిత్తు
చెలరేగిన మ్యాక్స్‌వెల్, మార్ష్ హరారే: ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. ఇక్కడి హరారే స్పోర్ట్స్ క్లబ్లో సోమవారం ఏకపక్షంగా జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆసీస్ 198 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (46 బంతుల్లో 93; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), మిషెల్ మార్ష్ (83 బంతుల్లో 89; 7 ఫోర్లు, 4 సిక్సర్లు)ల విధ్వంసకర బ్యాటింగ్‌తో ముందుగా ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 350 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆరోన్ ఫించ్ (79 బంతుల్లో 67; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, బ్రాడ్ హాడిన్ (58 బంతుల్లో 46; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మ్యాక్స్‌వెల్, మార్ష్ నాలుగో వికెట్‌కు 9 ఓవర్లలోనే 109 పరుగులు జోడించడం విశేషం. అనంతరం జింబాబ్వే 39.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. హామిల్టన్ మసకద్జా (91 బంతుల్లో 70; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్మిత్ 3 వికెట్లు పడగొట్టగా... స్టార్క్, లియోన్ చెరో 2 వికెట్లు తీశారు. మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు ఒక వికెట్ కూడా తీసిన మార్ష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. టోర్నీ తదుపరి మ్యాచ్‌లో బుధవారం ఇదే మైదానంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడతాయి. -
పోరాడాల్సిన సమయం
►సచిన్ సలహాలు తీసుకున్నా ►ఇంగ్లండ్‌తో వన్డేల్లో రాణిస్తా ►సురేశ్ రైనా ఇంటర్వ్యూ లండన్: ప్రతి జట్టులోనూ ఒకరిద్దరు ప్రత్యేకమైన ఆటగాళ్లుంటారు. వారు తమ పాత్రకు మాత్రమే పరిమితం కాకుండా.. మైదానం లోపల, బయట చురుగ్గా వ్యవహరిస్తూ జట్టులో ఉత్సాహం నింపుతుంటారు. సహచరుల విజయాన్ని తన సక్సెస్‌గా భావిస్తూ సంతోషం పంచుకుంటారు. వారు జట్టులో ఉంటే ఎప్పుడూ కొత్త ఉత్సాహం తొణకిసలాడుతూనే ఉంటుంది. అలాంటి ఆటగాళ్లలో ఒకడు సురేష్ రైనా. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు జట్టుతో కలిశాడు. టెస్టు సిరీస్‌లో ఓటమితో మానసికంగా కుంగిపోయి ఉన్న భారత జట్టులో తాను నూతనోత్సాహాన్ని నింపుతానని, పోరాడటమే ప్రస్తుతం తమ ముందున్న కర్తవ్యమని రైనా చెబుతున్నాడు. వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైనాతో ఇంటర్వ్యూ బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ తర్వాత విరామంలో ఏం చేశారు? ఇంగ్లండ్‌తో సిరీస్‌కు బయలుదేరడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం పొందే ప్రయత్నం చేశాను. ఇందుకోసం ఢిల్లీ, నోయిడాలలో టర్ఫ్ వికెట్‌పై ప్రాక్టీస్‌తోపాటు కొన్ని మ్యాచ్‌లూ ఆడాను. లక్నోలో చిన్నప్పుడు బోర్డింగ్ స్కూల్ విద్యార్థిగా చదువుకున్నప్పటి స్పోర్ట్స్ కాలేజిలోనూ ప్రాక్టీస్ చేశాను. పదిరోజులు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని ఇండోర్ స్టేడియంలో సాధన చేశాను. బీకేసీలో సచిన్ సలహాలేమైనా పొందారా? సచిన్ అక్కడికి బ్యాడ్మింటన్ ఆడేందుకు వచ్చేవారు. అర్జున్ టెండూల్కర్ నెట్స్‌లో ప్రాక్టీస్‌కు వచ్చాక అతని వద్దకు వెళ్లి సలహాలిచ్చేవారు. అదే సమయంలో నేను వెళ్లి ఇంగ్లండ్‌లో పరిస్థితుల గురించి సచిన్‌ను అడిగేవాణ్ని. సచిన్‌తోపాటు ప్రవీణ్ ఆమ్రేతో నా బ్యాటింగ్‌కు సంబంధించిన పలు విషయాలపై చర్చించాను. వారి సలహాలు తీసుకున్నాను. ఇంగ్లండ్‌లో పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా సిద్ధమయ్యారు? స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ప్రాక్టీస్ ఏమైనా చేశారా? స్వింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా టేపు వేసిన టెన్నిస్ బాల్‌తో ప్రాక్టీస్ చేశాను. తొలి వన్డేకు ముందు బ్రిస్టల్‌లో రెండు సెషన్లు సాధన చేస్తున్నాం. పరిస్థితుల్ని ఆకళింపు చేసుకోవడానికి ఈ మాత్రం ప్రాక్టీస్ సరిపోతుంది. కచ్చితంగా ఇంగ్లండ్‌తో వన్డేల్లో రాణిస్తాననే నమ్మకం ఉంది. టెస్టు సిరీస్‌లో ఓడిన జట్టుతో కలిశారు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుతో పాటు కలవడం గురించి చెప్పండి? ప్రస్తుతం జట్టు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఇలాంటప్పుడే స్థైర్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అంతటి ఓటమిని అధిగమించి ముందుకు సాగడం కష్టమైన పనే అయినా.. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు పోరాటపటిమను ప్రదర్శించాల్సివుంటుంది. అయితే కొత్త ఆటగాళ్ల రాక జట్టుకు నూతనోత్సాహం అందిస్తుంది. టెస్టు సిరీస్‌లో ఆడిన ఆటగాళ్లు తమ పొరపాట్ల నుంచి పాఠం నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. వారికి మేం కొత్త స్ఫూర్తిని అందిస్తాం. ఇది జట్టుగా పోరాడాల్సిన సమయం. సీనియర్ ఆటగాడిగా వన్డే జట్టులో చేరుతున్నారు.. జట్టులో సానుకూల దృక్పథం నింపే బాధ్యతను మీరే స్వయంగా తీసుకుంటారా? మైదానం లోపల, బయట ఎప్పుడూ జట్టులో ఉత్సాహం నింపేందుకే నేను ప్రయత్నిస్తుంటాను. వికెట్ పడినప్పుడు బౌలర్ లేదా ఫీల్డర్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అభినందించే మొదటి వ్యక్తిని నేను. ఇలాంటి చిన్న విషయాలే జట్టులో ఉత్సాహపూరిత వాతావరణం తెస్తాయి. ఒకరి నుంచి మరొకరికి ఇది స్ఫూర్తినిస్తుంది. ఈ విషయాన్ని మా కోచ్ వద్ద నేర్చుకున్నాను. మహి (ధోని) కూడా ఎవరైనా మంచి క్యాచ్ పట్టినప్పుడు, అద్భుతంగా ఫీల్డింగ్ చేసినప్పుడు వారి భుజం తట్టాలని చెబుతుంటాడు. దీని ద్వారా ఆటలో మనం ఎంతగా లీనమవుతున్నామన్న విషయం అర్థమవుతుందంటాడు. అందుకే మైదానంలో నా పనికి మాత్రమే పరిమితం కాకుండా ఇతరుల్ని ఉత్సాహపరుస్తూ సానుకూల దృక్పథం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాను. గత పదేళ్లుగా నేను దీన్ని ఫాలో అవుతున్నాను. ఇప్పుడూ అదే చేస్తాను. వన్డేల్లో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా రావాలని మీరు తపన పడుతుంటారు. నాలుగో స్థానంలో ఆడడానికి, ఆరో స్థానానికి ఏమైనా తేడా ఉంటుందా? రెండు కొత్త బంతుల నిబంధన వచ్చాక ఏ స్థానంలో ఆడినా దాదాపు ఒకేలా ఉంటోంది. కొద్దిసేపైనా కొత్త బంతిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా.. ప్రస్తుత టెయిలెండర్లు బ్యాటింగ్ బాగా చేయగలిగినవారు కాబట్టి వారితో కలిసి బ్యాటింగ్ చేయడం సులభమే. కానీ, ఆ సమయంలో దాదాపుగా పవర్ ప్లే అమల్లో ఉండి.. వికెట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే కనీసం ఒక బ్యాట్స్‌మన్ క్రీజులో నిలదొక్కుకుని చివరిదాకా ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిన బాధ్యత ఉంటుంది. పార్ట్ టైమ్ ఆఫ్‌స్పిన్నర్‌గా మీ బాధ్యతను ఎంతవరకు సీరియస్‌గా తీసుకుంటారు? మ్యాచ్‌లో నాలుగైదు ఓవర్లు, ఒక్కోసారి అంతకంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభిస్తుంది. అందుకు తగ్గట్టుగానే నేను సిద్ధంగా ఉంటాను. అయితే ప్రధానంగా పరుగుల వేగాన్ని అడ్డుకోవడమే నా బాధ్యతగా ఉంటుంది. కానీ, ఇటీవల టెస్టు సిరీస్‌ను గమనించాక.. బంతితోనూ రాణించే దిశగా దృష్టి పెడుతున్నాను. సౌరవ్ గంగూలీతోనూ కొద్దిసేపు ముచ్చటించినట్లున్నారు.. ఏ విషయంపై మాట్లాడారు? స్వయంగా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన సౌరవ్.. సాంకేతిక పరమైన విషయాల్లో సలహాలిచ్చారు. ప్రధానంగా ఇంగ్లండ్‌లో బ్యాటింగ్‌కు మానసికంగా ఎలా సిద్ధం కావాలో చెప్పారు. బ్రిస్టల్‌లో మూడేళ్ల తరువాత.. బ్రిస్టల్: భారత్, ఇంగ్లండ్‌ల మధ్య సోమవారం జరిగే తొలి వన్డే కోసం బ్రిస్టల్‌లోని క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడి బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్లో అంతర్జాతీయ మ్యాచ్ జరిగి ఇప్పటికి మూడేళ్లు కావడమే అందుకు కారణం. 2011, జూన్‌లో ఇంగ్లండ్, శ్రీలంకల మధ్య టి20 మ్యాచ్ జరిగాక మళ్లీ ఇక్కడ మ్యాచ్ జరగలేదు. ఇక వన్డే మ్యాచ్ అయితే 2010 జూలైలో ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగినదే చివరిది. అయితే సీటింగ్ సామర్థ్యం, సౌకర్యాలు మెరుగు పరచడం కోసం ఈ విరామం వచ్చింది. ప్రస్తుతం 15 వేల సీటింగ్ సామర్థ్యంతో గ్రౌండ్ సిద్ధమైంది. -
కుదురుకుంటారా!
నేడు మిడిలెసెక్స్‌తో భారత్ ప్రాక్టీస్ వన్డే లండన్: ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో ఘోరంగా ఓడిన భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌పై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో నేడు మిడిలెసెక్స్‌తో ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. వన్డే సిరీస్‌కు ముందు ఒకే ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో భారత్ దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. దాదాపుగా వన్డేల్లో ఆడే తుది జట్టుతోనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. టెస్టుల్లో ఆడిన పది మందికి తోడుగా ఏడుగురు కొత్త ఆటగాళ్లు జట్టుతో చేరారు. రైనా, రాయుడు, మోహిత్, ధావల్, శామ్సన్, కరణ్ శర్మ, ఉమేశ్‌లు ఇందులో ఉన్నారు. అయితే వీళ్లలో ఎంత మందికి తుది జట్టులో చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు టెస్టుల్లో ఓటమితో జట్టులో ఆత్మ విశ్వాసం పూర్తిగా కొరవడింది. ఓపెనర్ ధావన్‌తో పాటు కోహ్లిల ఫామ్ కలవరపెడుతోంది. రోహిత్ కూడా ఓ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. అయితే ఈ త్రయం కుదురుకునే అంశంపైనే ఇంగ్లండ్‌లో భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. బౌలింగ్ కూడా గాడిలో పడాల్సి ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ధోని ఆడే అవకాశాలు కనబడటం లేదు. అయితే తొలి వన్డేల్లో మాత్రం సీనియర్లను బరిలోకి దించాలని టీమ్ మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రాక్టీస్‌కు ఏడుగురు డుమ్మా కీలకమైన వన్డే సిరీస్‌కు ముందు భారత క్రికెటర్లు ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టారు. గురువారం లార్డ్స్ నర్సరీ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రాక్టీస్‌కు ధోని, ధావన్, రోహిత్, కోహ్లి, అశ్విన్, జడేజా, షమీలు గైర్హాజరయ్యారు. రహానే, భువనేశ్వర్, స్టువర్ట్ బిన్నీలతో పాటు యువ ఆటగాళ్లు మాత్రం నెట్స్‌లో చెమటోడ్చారు. బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు జో డేవిస్, ట్రెవర్ పెన్నీల ఆధ్వర్యంలో స్లిప్ క్యాచ్‌లు, త్రో డౌన్స్ సాధన చేశారు. తర్వాత బ్యాటింగ్, బౌలింగ్‌కు పదును పెట్టారు. సంజూ శామ్సన్ వికెట్ కీపింగ్‌తో పాటు స్లిప్‌లో రైనా, రహానేతో కలిసి క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశాడు. -
జట్టు బాధ్యత నాదే!
* ఆటగాళ్లలో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపాలి * రవిశాస్త్రి ఇంటర్వ్యూ లండన్: ఇంగ్లండ్‌తో టెస్టుల్లో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు అందరి దృష్టి వన్డే సిరీస్‌పైనే. చీఫ్ కోచ్ డంకన్ ఫ్లెచర్ అధికారాలను కత్తిరించి.. టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రిని నియమించడంతో ఈ భారత మాజీ కెప్టెన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆగస్టు 25న మొదలయ్యే ఐదు వన్డేల సిరీస్‌లో రవిశాస్త్రి పోషించబోయే పాత్ర ఏమిటి? ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతున్నారు? ఆయన ముందున్న లక్ష్యాలేమిటి? తదితర అంశాలతో రవిశాస్త్రి ఇంటర్వ్యూ క్లిష్ట పరిస్థితుల్లో టీమ్ డెరైక్టర్‌గా బాధ్యతలు తీసుకోవడం వెనుక ఏం జరిగింది? భారత క్రికెట్‌కు ఇది చాలా ముఖ్యమైన సమయం. టీమ్ డెరైక్టర్‌గా ఉండమని బోర్డు నుంచి పిలుపొచ్చింది. క్లిష్టమైన ఈ సమయంలో నా వంతు సహకారం అందించాలనుకున్నా. అందుకే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నా. నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం బీసీసీఐ. తొలుత రాష్ట్రానికి, ఆ తర్వాత దేశానికి భారత జట్టు తరఫున సేవలందించా. కష్టాల్లో ఉన్న జట్టుకు అండగా నిలుస్తా. పూర్తిస్థాయి కోచ్‌ను నియమించే వరకు జట్టుతో కొనసాగుతారా? ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ వరకే జట్టుకు డెరైక్టర్‌గా కొనసాగుతా. వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నేను ఈ సిరీస్ కోసం ప్రసారకర్తల నుంచి అనుమతి కూడా తీసుకున్నా. సిరీస్‌లో మీ పాత్ర ఏమిటి? కోచ్ ఫ్లెచర్ స్థానం మారిందా? జట్టు బాధ్యతలన్నీ నేనే చూస్తా. అయితే డంకన్ ఫ్లెచర్ పాత్రలో మార్పేమీ లేదు. ఆయన చీఫ్ కోచ్‌గా కొనసాగుతారు. మంగళవారం ఫ్లెచర్‌తో పాటు ధోనితో మాట్లాడా. ఫ్లెచర్ చాలా కాలం నుంచి జట్టుతో పాటు కొనసాగుతున్నారు. ఆయనపై ఆటగాళ్లకు గౌరవం ఉంది. వన్డే సిరీస్‌లో ఫ్లెచర్ ఆధ్వర్యంలో ఇద్దరు సహాయక కోచ్‌లు పనిచేస్తారు. టెస్టు సిరీస్‌లో ఘోర వైఫల్యం తర్వాత జట్టు కోల్పోయిన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తీసుకురావడమే మా లక్ష్యం. తద్వారా ఆటగాళ్లు వన్డే సిరీస్‌లో బాగా ఆడగలుగుతారు. సహాయ కోచ్‌లుగా భారత్‌కు చెందిన వారిని నియమించడానికి కారణమేంటి? ఇప్పుడున్న సపోర్టింగ్ స్టాఫ్‌ను మార్చి భారత్‌కు చెందిన వారిని సహాయ కోచ్‌లుగా నియమించాలన్న ఆలోచన నాదే. ఈ పర్యటనలో సహాయ కోచ్‌లు భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో తమ వంతు పాత్ర పోషిస్తారు. అందుకే కొత్త వారిని నియమించాల్సి వచ్చింది. టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత జట్టులో తీవ్ర భయాందోళన నెలకొన్నట్లుంది? అలాంటిదేమీ లేదు. అసలు భయాందోళన చెందాల్సిన అవసరమేముంది. గెలుపోటములు సహజమే. జట్టులో ప్రతిభావంతమైన ఆటగాళ్లున్నారు. ఇది యువ ఆటగాళ్లతో కూడిన జట్టనే విషయం మర్చిపోవద్దు. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత ప్రస్తుతం భారత జట్టులో సంధికాలం కొనసాగుతోంది. కుదురుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. అందరూ ఓపిక పట్టాలి. అప్పుడే ఆటగాళ్లు తమ సత్తా ఏంటో చూపగలుగుతారు. లార్డ్స్‌లో సంచలనం సృష్టించిన భారత జట్టు ఆ తర్వాత ఎందుకు నీరుగారిపోయింది? క్రికెట్‌తో నాకు 35 ఏళ్లుగా అనుబంధం కొనసాగుతోంది. ఇప్పటిదాకా విదేశాల్లో భారత జట్టు సాధించిన అతిపెద్ద విజయం లార్డ్స్ టెస్టే. ఇంతటి ఘనత సాధించిన జట్టును వరుస పరాజయాలు వెక్కిరించాయి. ఇందుకు కారణం అనుభవలేమేనని నేను కచ్చితంగా నమ్ముతున్నా. ఇదే ఈ సిరీస్‌లో భారత జట్టును ముంచింది. సిరీస్‌లో వెనకబడి ఉన్న దశలో ఇంగ్లండ్ స్వింగ్, పేస్‌కు అనుకూలించే పిచ్‌లను తయారు చేసింది భారత్‌ను దెబ్బకొట్టింది.. దీనిపై మీ అభిప్రాయమేంటి? సహజంగానే విదేశాల్లో జీవం ఉన్న పిచ్‌లు ఉంటాయి. ఆటగాళ్ల అనుభవలేమీ భారత్‌ను దెబ్బతీసింది. ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని గ్రహించిస్వింగ్, పేస్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లు తయారు చేశారు. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న అండర్సన్, బ్రాడ్ భారత్‌ను పేకమేడలా కూల్చారు. వోక్స్, జోర్డాన్ తమవంతు సహకారం అందించారు. వచ్చే ఏడాది స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ సిరీస్‌కు ఇలాంటి పిచ్‌లనే తయారు చేయమనండి. అప్పుడు వారికి అసలు సంగతేంటో తెలిసొస్తుంది. ఈ పిచ్‌లపై ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగడం గ్యారంటీ. అదే జరిగితే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పవు. ఇంగ్లండ్ చేతిలో ఓటమిని అభిమానులు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? లార్డ్స్‌లో విజయం తర్వాత భారత జట్టుపై అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. కానీ సిరీస్ ముగిసే సరికి పరిస్థితి మారిపోయింది. 1-3తో సిరీస్ కోల్పోవడం కంటే... ఇంగ్లండ్ చేతిలో పోరాడకుండానే ఓడిపోయారనే బాధ అభిమానుల్లో ఉంది. అందుకే వాళ్లు దారుణ పరాజయాల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. -
అదే ‘స్ఫూర్తి’ కావాలి!
ఇంగ్లండ్‌తో టెస్టుల్లో ఎదురైంది అవమానకర ఓటమే. గతంలో ఎన్నడూ చూడని పరాభవమే కావచ్చు... కానీ అడుగులు అక్కడే ఆగిపోవుగా! పడిన ప్రతీ సారి పైకి లేచేందుకు కూడా ఆటలో మరో అవకాశం ఉంటుంది. అణువణువునా ఆత్మవిశ్వాసం లోపించిన భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌తో టెస్టుల్లో మట్టికరిచింది గాక... కానీ ఉస్సురని కూలిపోకుండా ఉవ్వెత్తున లేచేందుకు, మన బలం, బలగం చాటేందుకు మళ్లీ సన్నద్ధమవ్వాలి. వన్డేలకు జట్టూ మారింది... ఆపై అండగా నిలిచేందుకు కొత్త సహాయక సిబ్బందీ రానున్నారు. అన్నట్లు...ఇంగ్లండ్ గడ్డపై ఆఖరి సారి వన్డేలు ఆడినప్పుడు మనమే చాంపియన్స్ ట్రోఫీ చాంపియన్లం. జట్టులో కొత్త ఉత్సాహం నింపేందుకు నాటి ప్రదర్శన స్ఫూర్తి సరిపోదా! ఏడాది క్రితం ఇంగ్లండ్‌లోనే జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ ఎక్కడా ఉదాసీనత కనబర్చకుండా ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక...ఇలా ప్రతి పటిష్ట జట్టును ఓడించింది. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ అయితే అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఒక దశలో గెలుపు అవకాశాలు లేకున్నా... పట్టుదలతో భారత జట్టు విజయాన్ని అందుకుంది. అప్పుడు కూడా ఇంగ్లండ్‌లో సీమర్లకు అనుకూలించే వాతావరణంలో భారత జట్టు టైటిల్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ మనవాళ్లు సమష్టి ప్రదర్శనతో సంచలనం నమోదు చేశారు. వాళ్లలో తొమ్మిదిమంది... నాటి జట్టులో ఉన్న తొమ్మిది మంది ఆటగాళ్లు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కూడా ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో వారు, వీరని లేకుండా ఆటగాళ్లంతా కీలక పాత్ర పోషించారు. 2 సెంచరీలు సహా 363 పరుగులు చేసి ధావన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకుంటే... కోహ్లి, రోహిత్ శర్మ నిలకడైన ఆటతీరుతో అతనికి అండగా నిలిచారు. ఇక ఇంగ్లండ్ వికెట్లపై కూడా స్పిన్‌తో విజయాలు దక్కుతాయని జడేజా నిరూపించాడు. కేవలం 12.83 సగటుతో అతను 12 వికెట్లు తీశాడు. ఇక ఆరంభ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తూ భువనేశ్వర్ విజయానికి బాటలు వేశాడు. వీరంతా ఇప్పుడు వన్డే సిరీస్‌లో అప్పటి ప్రదర్శనను పునరావృతం చేయాల్సి ఉంది. రైనా రాకతో వన్డే బ్యాటింగ్ పటిష్టంగా మారిందనడంలో సందేహం లేదు. రహానే, రాయుడు కూడా మిడిలార్డర్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మరో వైపు వన్డే వరల్డ్ కప్‌కు ఎక్కువగా సమయం లేదు. ఇంగ్లండ్‌లోని పరిస్థితుల్లో ఈ సిరీస్‌లో రాణించే ఆటగాళ్లకే ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్‌లో చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి శామ్సన్, కరణ్ శర్మలాంటి ఆటగాళ్లు కూడా తమ సామర్థ్యం నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. వన్డే వ్యూహాల్లో దిట్ట టెస్టు కెప్టెన్సీ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా... ధోని వన్డే కెప్టెన్సీ మాత్రం అద్భుతం అనేది అందరూ అంగీకరించాల్సిందే. ఏ దశలోనూ గెలుపు అవకాశం లేని స్థితినుంచి జట్టును విజయం వైపు మళ్లించడం ధోనికి వెన్నతో పెట్టిన విద్య. క్లిష్ట పరిస్థితుల్లో అతడి వ్యూహాలే జట్టును నిలబెడతాయి. ఒక్కసారి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటే చాలు అతనేమిటో తెలుస్తుంది. 3 ఓవర్లలో 27 పరుగులిచ్చిన ఇషాంత్‌తో 18వ ఓవర్ వేయించడం... అదే ఓవర్లో 2 వికెట్లతో మ్యాచ్ భారత్ వైపు మళ్లించడం ధోనికే సాధ్యమైంది. కెప్టెన్సీనే కాకుండా ధోని ధనాధన్ బ్యాటింగ్ కూడా జట్టుకు బలం. 2011 సిరీస్‌లో వన్డేల్లోనూ మనకు ఒక్క విజయం కూడా దక్కలేదు. అయితే ఈ సారి గత రికార్డును సవరించాలని ధోని భావిస్తున్నాడు. కాబట్టి టెస్టు సిరీస్‌తో పోలిస్తే కెప్టెన్‌నుంచి మరింత మెరుగైన ఫలితాన్ని ఆశించవచ్చు. శాస్త్రి బృందం ఏం చేయనుంది..? అంతర్జాతీయ క్రికెట్‌నుంచి రిటైర్ అయిన వెంటనే రవిశాస్త్రి... తాను కామెంటేటర్‌గా మారనున్నట్లు, రెండేళ్లలో అగ్రశ్రేణి వ్యాఖ్యాతగా నిలబడతానని తన సహచరులతో చాలెంజ్ చేశాడు. పట్టుదలతో అతను దానిని చేసి చూపించాడు. క్రికెట్ ఆడే సమయంలోనూ భారత జట్టులో ‘మానసికంగా దృఢమైన’ వ్యక్తిగా శాస్త్రికి పేరుంది. రవిశాస్త్రి భారత డెరైక్టర్ పాత్ర నిర్వహించేందుకు సమర్థుడు అని అందరూ అంగీకరిస్తున్నారు. ఇప్పుడు జట్టులో ఆటగాళ్ల ప్రతిభను బట్టి చూస్తే పెద్దగా సమస్య లేదు. ఆటగాళ్లతో సంభాషిస్తూ వారి బలాలు, బలహీనతలు గుర్తించి వన్డేలకు తగిన విధంగా మలచడం శాస్త్రిలాంటి సీనియర్‌కు సమస్య కాకపోవచ్చు. అయితే భారీ ఓటమినుంచి వారిని విజయాల బాట పట్టించాలంటే మానసికంగా ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాల్సి ఉంది. ఈ సమయంలో సంజయ్ బంగర్ సహకారం కూడా కీలకం కానుంది. ఐపీఎల్లో పంజాబ్ ఒక్కసారిగా దూసుకు రావడానికి... క్రెడిట్ మొత్తం బంగర్‌దే. మార్పుల తర్వాతైనా టెస్టు పరాజయాలు మరచిపోయే విధంగా భారత్ వన్డేల్లో విజయాలతో అభిమానులను అలరించాలని, తిరిగి గాడిలో పడి ప్రపంచకప్‌కు సన్నద్ధం కావాలని కోరుకుందాం. ఎందుకంటే ఉపఖండంలో మ్యాచ్‌లను మినహాయిస్తే ఈ సిరీస్ తర్వాత మనం వన్డేలు ఆడేది ఆస్ట్రేలియా గడ్డపైనే! - సాక్షి క్రీడా విభాగం -
వన్డే సిరీస్‌కు టీమిండియా సెలెక్షన్
-
భారత్-బంగ్లాదేశ్ మూడో వన్డే రద్దు
మిర్పూర్: భారత్-బంగ్లాదేశ్ మూడో వన్డే వర్షం కారణంగా రద్దయింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ దిగిన భారత్ 34.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. అంతకుముందు వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 40 ఓవర్లకు కుదించారు. మూడుసార్లు ఆటకు ఆటంకం కలిగించిన వర్షం ఎంతకు తగ్గకపోవడంతో చివరకు మ్యాచ్ రద్దు చేశారు. రైనా 25, బిన్నీ 25, పూజారా 27 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ 3 వికెట్లు తీశాడు. ఆల-అమిన్, తస్కిన్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మోర్తజా, గాజి చెరో వికెట్ దక్కించుకున్నారు. -
13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్
మిర్పూర్: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. ఆట జరుగుతుండగా వర్షం కురవడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. ఆట నిలిచిపోయే సమయానికి 8.3 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసింది. రాబిన్ ఊతప్ప 5, రహానే 3 పరుగులు చేసి అవుటయ్యారు. అంబటి రాయుడు ఒక్క పరుగుకే పెవిలియన్ కు చేరాడు. పూజారా(3), తివారి(0) క్రీజ్ లో ఉన్నారు. మోర్తజా, ఆల-అమిన్, తస్కిన్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. మూడు వన్డేల సిరీస్ ను భారత్ ఇప్పటికే 2-0తో గెల్చుకుంది. రెండో వన్డేకూ వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. -
ఎడ్వార్డ్స్, బ్రేవో బాదారు.. కివీస్ బేజారు
హామిల్టన్: న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. చివరి వన్డేలో కివీస్‌ను విండీస్ 203 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. కిర్క్ ఎడ్వార్డ్స్(123), డ్వేన్ బ్రేవో(106) సెంచరీలతో కదం తొక్కారు. ఓపెనర్ పావెల్(73) అర్థ సెంచరీతో రాణించాడు. చార్లెస్ 31 పరుగులు చేశాడు. కివీస్ మెక్ కల్లమ్, ఆండర్సన్, విలియమ్సన్ ఒక్కో వికెట్ తీశారు. 364 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 160 పరుగులకే కుప్పకూలింది. ఆండర్సర్(29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో మిల్లర్ 4 వికెట్లు పడగొట్టాడు. హోల్డర్, రసెల్ రెండేసి వికెట్లు తీశారు. బ్రేవో ఒక వికెట్ దక్కించుకున్నాడు. డ్వేన్ బ్రేవోకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. మొదటి వన్డేలో వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో నెగ్గగా, రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. మూడు, నాలుగు వన్డేల్లో న్యూజిలాండ్ విజయంగా సాధించింది.