జో రూట్‌ సెంచరీ.. భారత్‌కు టఫ్‌ టార్గెట్‌..! | England Set 323 Target To Team India In Second One day | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 14 2018 7:42 PM | Last Updated on Sat, Jul 14 2018 10:51 PM

England Set 323 Target To Team India In Second One day - Sakshi

లండన్‌ : లార్డ్స్‌ మైదానంలో జరుగుతున్న కీలకమైన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత ఓవర్లలో ఇంగ్లండ్‌ 7వికెట్లు నష్టపోయి 322 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఓపెనర్లు జాసన్‌ రాయ్‌, బెయిర్‌ స్టోలు ఆరంభం నుంచే దాటిగా ఆడటంతో స్కోర్‌ 10 ఓవర్లలోనే 68 పరుగులకు చేరింది. ఆ తరుణంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చైనామన్‌ కుల్దీప్‌ చేతికి బంతి ఇచ్చాడు.

కుల్దీప్‌ తన మొదటి ఓవర్‌ రెండో బంతికే బెయిర్‌ స్టో(38) ఎల్‌బీడబ్య్లూ రూపంలో ఫెవిలియన్‌కు పంపాడు. చైనామన్‌ ధాటిగా ఆడుతున్న జాసన్‌ రాయ్‌, బెయిర్‌ స్టో జోడిని విడదీశాడు. ఇంగ్లండ్‌ 69 పరుగుల వద్ద మొదటి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన జో రూట్‌తో కలిసి జాసన్‌ రాయ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నాం చేశాడు. కానీ, చైనామన్‌ కుల్దీప్‌ స్పిన్‌ మాయలో జాసన్‌ రాయ్‌ చిక్కుకున్నాడు. కుల్దీప్‌ వేసిన 14.1 ఓవర్‌లో రాయ్‌ భారీ షాట్‌ ఆడబోయి ఉమేష్‌యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. 

జో రూట్‌ కెప్టెన్‌ మోర్గాన్‌తో కలిసి స్కోర్‌ బోర్టును పరుగులు పెట్టించాడు. ఇదే క్రమంలో మోర్గాన్‌, జో రూట్‌లు హాఫ్‌ సెంచరీలు నమోదు చేశారు. కానీ, కుల్దీప్‌ తన స్పిన్‌మాయతో ఆ జోడి పని పట్టాడు.  30.3 ఓవర్‌లో మోర్గాన్‌ సిక్స్‌ కొట్టడానికి ప్రయత్నించి ధావన్‌ చేతికి చిక్కాడు. దీంతో ఇంగ్లండ్‌ 189 పరుగుల వద్ద మోర్గాన్‌ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన బెన్‌ స్టోక్స్(5)‌, జాస్‌ బట్లర్(4), మొయిన్‌ ఆలీ(13) ఒక్కరి తర్వాత  ఒక్కరు వరుసగా ఫెవిలియన్‌ బాట పట్టారు. 239 పరుగులకు ఇంగ్లండ్‌ ఆరు వికెట్లు కోల్పోయింది. 

జో రూట్‌, డేవిడ్‌లు ఆ తర్వాత టీమిండియా బోలర్లపై విరుచుకుపడ్డారు. జో రూట్‌ 109  బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత డేవిడ్‌ విల్లే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయ్యాడు. సిద్ధార్‌ కౌల్‌ వేసిన 46వ ఓవర్‌లో వరుసగా 4, 6, 4 కొట్టి భారీ స్కోరు పిండుకున్నాడు. జో రూట్‌(8ఫోర్లు, సిక్స్‌) 116 బంతుల్లో 113 పరుగులు చేశాడు. కీలకమైన రెండో వన్డేలో జో రూట్‌ ఒంటరి పోరాటం చేశాడు. డేవిడ్‌ 31 బంతుల్లో(5ఫోర్లు, సిక్స్‌) హాఫ్‌ సెంచరీ చేశాడు. టీమిండియో బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 3వికెట్లు, ఉమేష్‌ యాదవ్‌, హర్ధిక్‌ పాండ్యా, చాహల్‌లకు చేరో వికెట్‌ దక్కాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement