వన్డే క్రికెట్ ఇప్పటికీ ఓ వండర్.. టీ20 వంటి ఫాస్ట్ ఫార్మాట్‌రంగ ప్రవేశం చేసిన తర్వాత కూడా స్పీడ్ తరగని థండర్.వన్డే ఎక్కడ జరిగినా స్టేడియంలో పోటెత్తే అభిమానులసాక్షిగా తరగని థ్రిల్‌కు ఈ మ్యాచ్ ఆలవాలం. నేటికీటీవీలకు కళ్లప్పగించి మ్యాచ్‌లో మమేకమయ్యే జనమేఅందుకు నిదర్శనం. అనుకోని ఫలితాలే ఈ థ్రిల్‌కుఆలంబన అని ఏ అభిమానిని అడిగినా చెబుతాడు. అటువంటి మ్యాచ్‌ల జాబితా కూడా వల్లె వేస్తాడు. అలాటిఅనుకోని ఫలితమే విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలోఅయిదేళ్ల కిందట చోటుచేసుకుంది. అప్పటికే గతి తప్పినవెస్టిండీస్ జట్టు జోరుమీద ఉన్న టీమిండియాను ఆమ్యాచ్‌లో చిత్తు చేసింది. ఇప్పుడు మరింతగాతడబడుతున్న విండీస్ జట్టు తలపుల్లో ఆ గెలుపుకచ్చితంగా కదులుతుంది.
విశాఖ స్పోర్ట్స్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్డే సమరం కోసం భారత, వెస్టిండీస్ జట్లు విశాఖ చేరుకున్నాయి. మరో రోజు వ్యవధిలో సిరీస్‌లో రెండో వన్డేలో గెలుపు కోసం రెండు జట్లు వైఎస్సార్ స్టేడియం వేదికగా డేనైట్ మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో గతంలో రెండు జట్లు తలపడ్డ మ్యాచ్‌లు అభిమానుల స్మృతులలో మెదలడం సహజమే. విశాఖ పాతనగరంలో ఉన్న ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో వెస్టిండీస్ భారత్‌తో ఒక మ్యాచ్ ఆడి ఓటమి చవిచూడగా.. వైఎస్సార్ స్టేడియంలో రెండు మ్యాచ్‌లలో తలపడి ఒకదానిలో ఓడి ఒకదానిని దక్కించుకుంది. హుద్‌హుద్ తర్వాత రెండు రోజులకు జరగాల్సిన మ్యాచ్ రద్దయింది.
విజయాల జోరుకు బ్రేక్
వైఎస్‌ఆర్ స్టేడియం ప్రారంభమైన తర్వాత వరుసగా నాలుగు వన్డేలలో విజయం సాధించి జోరుమీద ఉన్న టీమిండియాకు వెస్టిండీస్ ద్వారానే ఎదురుదెబ్బ తగిలింది. 2013లో మాత్రం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ను విండీస్ రెండు వికెట్ల తేడాతో ఓడించింది. స్టేడియంలో భారత్ ఓడిన తొలి మ్యాచ్ అదే. అంతకు ముందే విండీస్‌తో జరిగిన మరో వన్డేలో భారత్ గెలుపొందడంతో ఇప్పుడు రెండు జట్లూ విశాఖలో సమ ఉజ్జీలుగా ఉన్నట్టయింది. బుధవారం జరగనున్న మ్యాచ్‌లో గెలిచే జట్టు విశాఖలో పైచేయి సాధించినట్టవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ జోరుకు అనుభవలేమితో సతమతమవుతున్న విండీస్ బృందం అడ్డుకట్ట వేయడం కష్టమే అనుకున్నా.. వన్డేల్లో ఫలితం ఎలా ఉంటుందో ఊహించడం కష్టం కనుక ఉత్కంఠ చివరివరకు కొనసాగే అవకాశం ఉంది.
మందకొడి బ్యాటింగ్
2013 నవంబర్ 24న జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ వెస్టిండీస్ కోరిక మేరకు బ్యాటింగ్‌కు దిగింది. తొలి పది ఓవర్ల పవర్‌ప్లేలో 48 పరుగులే చేసింది. వంద పరుగుల మార్కు చేరేప్పటికి ఇరవై ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. కోహ్లీ ఈ మ్యాచ్‌లో (వైజాగ్‌లో) సెంచరీల హ్యాట్రిక్ సాధిస్తాడనుకున్న అభిమానులకు గట్టి షాక్ తగిలింది. వందో బంతి ఆడుతున్న ఈ స్టార్ బ్యాట్స్‌మన్, రామ్‌పాల్ బౌలింగ్‌లో హోల్డర్ క్యాచ్ పట్టడంతో 99 పరుగుల వద్ద సెంచరీని కోల్పోయాడు. యువరాజ్ 28 పరుగులే చేయగా, ధోనీ 40 బంతుల్లో 51పరుగులతో అజేయంగా నిలిచి కెరీర్‌లో ఏభయ్యో అర్థసెంచరీని అందుకున్నాడు. భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది.
విండీస్ బ్యాట్స్‌మెన్ జోరు
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ తొలి రెండు వికెట్లను 23 పరుగులకే కోల్పోయినా తొలి పవర్ ప్లేలో 60 పరుగులు రాబట్టేసింది. పావెల్ 59 పరుగులు చేశాడు. సిమ్మన్స్(62)తో కలిసిన కెప్టెన్ బ్రావో (50) మిడిలార్డర్‌ను చక్కదిద్దాడు. ఈ దశలో ఏడో ఆటగానిగా 41వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగిన సామీ భారత్‌కు చుక్కలు చూపించాడు. 22 బంతుల్లో 19 పరుగులు చేస్తే గెలుపొందే స్థితికి జట్టును చేర్చాడు. అతడు అజేయంగా 63 పరుగులతో నిలవడమే కాక.. విండీస్‌కు రెండు వికెట్ల ఆధిక్యంతో చిరస్మరణీయ విజయం దక్కేలా చేశాడు.
విండీస్‌కు అది వండర్‌ఫుల్ విజయం
2005లో వైఎస్సార్ స్టేడియం ప్రారంభమైనప్పటి నుంచి విశాఖలో గెలుపు జోరు మీద ఉన్న భారత జట్టుకు ఎనిమిదేళ్ల తర్వాత గానీ బ్రేక్ పడలేదు. వరుసగా నాలుగు వన్డేల్లో విజయం సాధించి మంచి ఊపుమీద ఉన్న టీమిండియాకు వెస్టిండీస్ ద్వారా తగిలిన షాక్ ఓ చేదు అనుభవంగా మిగిలిపోవడంతో ఆశ్చర్యం లేదు.
Comments
Please login to add a commentAdd a comment