
పూణే: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో తృటిలో సెంచరీని(98) చేజార్చుకున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ అరుదైన ఘనతను సాధించాడు. ఆసియాలో అత్యధిక పరుగులు చేసిన భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ల జాబితాలో అతను ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ (10589), యువరాజ్ సింగ్ (7954), గౌతమ్ గంభీర్ (7327), సురేష్ రైనా (5027) ధవన్ కంటే ముందున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ ద్వారా ధవన్ ఆసియాలో 5000 పరుగులు పూర్తి చేశాడు. ఓవరాల్‌గా(అన్ని ఫార్మాట్లు కలిపి) ధవన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 12000కు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 24 శతకాలు, 48 అర్ధశతాకలు ఉన్నాయి.
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఆచితూచి ఆడుతూ.. చెత్త బంతులను బౌండరీలు తరలిస్తూ పరుగులు రాబట్టారు. వీరి జోడీ తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. ఆతర్వాత క్రమం తప్పకుండా వికెట్లుకోల్పోవడంతో టీమిండియా 42 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 227 పరుగుల సాధించింది. రోహిత్(42 బంతుల్లో 28; 4 ఫోర్లు), కోహ్లి(60 బంతుల్లో 56; 6 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్(9 బంతుల్లో 6; ఫోర్), ధవన్(106 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్ధిక్(9 బంతుల్లో 1) అవుటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 3, మార్క్ వుడ్‌కు 2 వికెట్లు దక్కాయి.
చదవండి:
మాన్యా సింగ్ స్ఫూర్తిదాయక కథపై శిఖర్ ధావన్ స్పందన
Comments
Please login to add a commentAdd a comment