అరుదైన రికార్డుపై కన్నేసిన హిట్‌మ్యాన్‌-గబ్బర్‌ జోడీ | Rohit Sharma, Shikhar Dhawan 6 Runs Away From Emulating Sachin Tendulkar, Sourav Ganguly Record | Sakshi
Sakshi News home page

IND VS ENG 1st ODI: అరుదైన రికార్డుకు 6 పరుగుల దూరంలో ఉన్న రోహిత్‌-ధవన్‌ జోడీ

Published Tue, Jul 12 2022 1:47 PM | Last Updated on Tue, Jul 12 2022 1:49 PM

Rohit Sharma, Shikhar Dhawan 6 Runs Away From Emulating Sachin Tendulkar, Sourav Ganguly Record - Sakshi

Rohit-Dhawan: పరిమిత ​ఓవర్ల క్రికెట్‌లో అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీల్లో ఒకటిగా పరిగణించబడే రోహిత్ శర్మ-శిఖర్ ధవన్‌లు వన్డేల్లో ఓ అరుదైన రికార్డుపై కన్నేశారు. ఈ ద్వయం ఇవాళ (జులై 12) ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి వన్డేలో మరో ఆరు పరుగులు జోడిస్తే ఫిఫ్టి ఓవర్స్‌ ఫార్మాట్‌లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న నాలుగో జోడీగా రికార్డుల్లోకెక్కనుంది. 

హిట్‌మ్యాన్‌-గబ్బర్‌ జోడీ ఇప్పటివరకు 111 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 4994 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం నమోదు చేసింది. ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌-సౌరవ్‌ గంగూలీ జోడీ అగ్రస్థానంలో ఉంది. సచిన్‌-గంగూలీ ద్వయం 136 ఇన్నింగ్స్‌ల్లో 6609 పరుగులు జోడించింది. వీరి తర్వాత స్థానాల్లో ఆసీస్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఓపెనింగ్‌ జోడీ మాథ్యూ హేడెన్‌-ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (114 ఇన్నింగ్స్‌ల్లో 5472), విండీస్‌ లెజెండరీ ఓపెనింగ్‌ పెయిర్‌ గార్డన్‌ గ్రీనిడ్జ్‌-డెస్మండ్‌ హేన్స్‌ (102 ఇన్నింగ్స్‌ల్లో 5150) ఉన్నారు. 

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 తేడాతో చేజిక్కించుకున్న భారత్‌.. ఇవాళ కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌ వేదికగా తొలి వన్డే ఆడనుంది.  ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, శిఖర్ ధవన్‌లు టీమిండియా తరఫున ఓపెనింగ్ చేయనున్నారు. ఇటీవలి కాలంలో ధవన్‌కు సరైన అవకాశాలు లేకపోవడంతో చాలాకాలం తర్వాత ఈ జోడీ కలిసి బరిలోకి దిగనుంది. 
చదవండి: Ind Vs Eng: కోహ్లి లేడు.. బుమ్రా, సిరాజ్‌ను కాదని అర్ష్‌దీప్‌ సింగ్‌కు ఛాన్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement