భారత్-బంగ్లాదేశ్ మూడో వన్డే వర్షం కారణంగా రద్దయింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది.
మిర్పూర్: భారత్-బంగ్లాదేశ్ మూడో వన్డే వర్షం కారణంగా రద్దయింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ దిగిన భారత్ 34.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. అంతకుముందు వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 40 ఓవర్లకు కుదించారు.
మూడుసార్లు ఆటకు ఆటంకం కలిగించిన వర్షం ఎంతకు తగ్గకపోవడంతో చివరకు మ్యాచ్ రద్దు చేశారు. రైనా 25, బిన్నీ 25, పూజారా 27 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ 3 వికెట్లు తీశాడు. ఆల-అమిన్, తస్కిన్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మోర్తజా, గాజి చెరో వికెట్ దక్కించుకున్నారు.